సాక్షి,బళ్లారి: అదో ప్రముఖ ఆధ్యాత్మికత క్షేత్రం. ఎంతో మంది భక్తులు ఆరాధించే మఠం కూడా. అయితే అక్కడ ఓ స్వామీజీ నగ్నంగా ఓ అమ్మాయితో మసాజ్ చేయించుకోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ధారవాడ జిల్లా కవలగేరి మఠానికి చెందిన శివానంద మఠ సరస్వతి స్వామీజీ కామ పురాణం వీడియో బయటకు వచ్చింది. ఇంత వరకు స్వామీజీ సన్యాసి అని జనం ఎంతో భక్తితో పూజించేవారు. అయితే ఆయన ఓ మహిళతో నగ్నంగా ఉంటూ మసాజ్ చేయించుకున్నారు. మసాజ్ చేయించుకున్న వీడియోను ఐదు మంది తమ దగ్గర ఉంచుకుని స్వామీజీని డబ్బు డిమాండ్ చేశారు.
రూ.20 లక్షలు ఇవ్వకపోతే వీడియో వైరల్ చేస్తామని బెదిరించారు. స్వామీజీ వారితో చర్చలు జరిపి రూ.10 లక్షలకు డీల్ కుదుర్చుకుని, చెప్పిన ప్రకారం రూ.7 లక్షలు అడ్వాన్స్ ఇచ్చారు. అనంతరం వీడియోను డిలీట్ చేయాలని విన్నవించారు. మిగిలిన రూ.3 లక్షలు ఇవ్వలేదని, ఐదు మందిలో ఒకరు వీడియోను బయటకు వదలడంలో స్వామీజీ మసాజ్ వీడియో వైరల్ అయింది. సన్యాసిగా ఫోజులు ఇచ్చిన స్వామీజీ కామ పురాణం వీడియో బయట పడటంతో ఒక్కసారిగా మఠం పరిసరాల్లో జనం చేరి స్వామీజీ తీరుపై తీవ్రంగా విమర్శిస్తున్నారు. కాగా తనను బ్లాక్ మెయిల్ చేసి, వీడియోను వైరల్ చేసిన వారిపై స్వామి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ధార్వాడ గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేశారు.


