మోసగాళ్లకు వరం.. నకిలీ సిమ్‌లు
క్షణాల్లో సిమ్‌ల మంజూరు
ఆధార్ కార్డు జిరాక్స్ కాపీ ఇస్తే చాలు కొద్ది క్షణాల్లో సిమ్‌లను అందిస్తున్నారు. ఓటీపీ కోసం ప్రత్యామ్నాయ నంబరు ఇస్తారు. కొత్త సిమ్ ఈ–కేవైసీకి నెలల సమయం కావాలి. అంతలోగా వంచకులు సిమ్‌లతో పలువురికి బురిడీ కొట్టిస్తున్నారని పోలీసులు తెలిపారు.
అక్రమ సిమ్‌కార్డుల ద్వారా
సైబర్ మోసాలు
బనశంకరి: రోడ్డు పక్కన, ఫుట్‌పాత్‌ల మీద అతి తక్కువ ధరతో, లేదా ఉచితంగా లభించే సిమ్‌కార్డులు సైబర్ నేరగాళ్లకు వరంగా మారుతున్నాయి. వాటి ద్వారా అమాయకులకు కాల్స్ చేస్తూ, బ్యాంకు ఖాతాలను నిర్వహిస్తూ ప్రజలను దోచేస్తున్నారు. పోలీసులు నిందితులను అరెస్టు చేసినప్పుడు ఈ విషయం రుజువైంది. రాష్ట్రంలో ఈ ఏడాది ఇలాంటి 18 కేసులను పోలీసులు వెలికితీశారు. గుర్తుతెలియని వ్యక్తుల పేరుతో కంపెనీల సిమ్ కార్డులను చాలా ఈజీగా తీసుకోవచ్చు. 12 గంటల్లోగా సిమ్ యాక్టివేషన్ అవుతుంది. కంపెనీలు మార్కెట్‌లో పోటాపోటీగా కస్టమర్లను ఆకట్టుకోవడానికి ఇష్టానుసారం సిమ్‌లను జారీ చేయడం ఆన్‌లైన్ నేరాలకు ఊతమిస్తోంది.
నిబంధనలు గాలికి
ఒక వ్యక్తి తన ఆధార్ కార్డుపై 9 సిమ్‌కార్డులను మాత్రమే కొనుగోలు చేయడానికి అవకాశం ఉంది. ఇతరుల పేర్లతో అక్రమంగా సిమ్ కార్డులను పొందినా, జారీచేసినా జరిమానా, జైలుశిక్ష పడేలా చట్టాలున్నాయి. ఒక ఆధార్ నంబరుతో ఎన్ని సిమ్‌కార్డులు నమోదయ్యాయి అనేదానిని ధృవీకరించుకోవడానికి సంచార్ సారధి యాప్‌లో అవకాశం ఉంది.
రూ.500 ఇస్తే జిరాక్స్ కాపీ
ఇతరుల ఆధార్ కార్డుల జిరాక్సులను కోరినన్ని సరఫరా చేసే ముఠాలు బెంగళూరుతో పాటు అన్నిచోట్లా చురుగ్గా ఉన్నాయి. రూ.500 ఇస్తే చాలు ఆధార్ జిరాక్స్‌లు ఇస్తారు. కొన్నిచోట్ల జిరాక్స్ సెంటర్లతో కుమ్మకై ్క ఈ దందాను సాగిస్తున్నారు. కర్ణాటకలో తీసుకున్న సిమ్‌లను బయటి రాష్ట్రాలు, బయటి రాష్ట్రాల్లోని సిమ్‌లను ఇక్కడ విక్రయిస్తున్నారు. పోలీస్, సీఐడీ, సీబీఐ, కస్టమ్స్ అధికారుల పేర్లతో ట్రూకాలర్‌లో సేవ్ చేసి మోసాలకు తెరతీస్తారని పోలీసులు దర్యాప్తులో గుర్తించారు.
ఇతరుల ఆధార్‌తో యథేచ్ఛగా జారీ
బెంగళూరుతో పాటు
రాష్ట్రమంతటా నేర ముఠాల దందా
పోలీసులకు సవాల్
మోసగాళ్లకు వరం.. నకిలీ సిమ్‌లు
మోసగాళ్లకు వరం.. నకిలీ సిమ్‌లు


