బ్యాంకు ఖాతాలు సైతం
ఆధార్ ఐడీలు సైబర్ వంచకుల చేతికి వెళ్లడంతో దేశవ్యాప్తంగా డిజిటల్ అరెస్ట్ కేసులు అధికమయ్యాయి. ఆధార్ నంబరుతో ఆ వ్యక్తి బ్యాంక్ అకౌంట్, పాన్ నంబర్ ను ఇట్టే కనిపెడతారు. 50 శాతం డిజిటల్ అరెస్ట్ కేసుల్లో మోసగాళ్లకు ఇదే ఆధారం. టెక్కీలు, వ్యాపారవేత్తలు, రిటైర్డు ఉద్యోగులకు ఫోన్లు చేసి మొదట వారి ఆధార్ సంఖ్యను చెబుతారు, దీంతో నిజమేనేమోనని భయపడి నేరగాళ్ల వలలో పడిపోతున్నారు. ఆపై బెదిరించి కోట్లాది రూపాయలను తమ అకౌంట్లకు జమ చేసుకుంటున్నారు. ఆధార్ కార్డు ఇతరులకు చేరడం ఇంత పని చేస్తోందని ఆందోళన నెలకొంది. ఐటీ నగరంలో డ్రగ్స్ వ్యాపారంలో ఉన్న విదేశీయుల వద్ద 15 సిమ్ కార్డులు దొరికాయి. స్థానికుల ఆధార్‌కార్డులతో తీసుకున్నట్లు వెలుగుచూసింది. అదే ఆధార్‌లతో బ్యాంక్ అకౌంట్లను తెరిచి అక్రమ నగదు దందా చేపడుతున్నట్లు పోలీసులు దర్యాప్తులో వెల్లడైంది.


