కర్ణాటక: కార్పొరేట్ ఉద్యోగానికి రాజీనామా చేసి పని ఒత్తిడి తట్టుకోలేక ఆటోను నడుపుతున్నట్లు యువకుడి వీడియో బెంగళూరు వాసులకు ఆశ్చర్యం కలిగిస్తోంది. రాకేశ్ బెంగళూరులో ఒక కార్పొరేట్ సంస్థలో పని చేస్తున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు పని ఒత్తిడి తట్టుకోలేక ఉద్యోగానికి రాజీనామా చేసి వచ్చిన పీఎఫ్ డబ్బులతో ఆటోను కొనుగోలు చేశారు. కొత్త జీవితంలో రోజు ఇబ్బంది లేకుండా ఆటోను నడిపి తన జీవిత నిర్వహణకు డబ్బులు సంపాదిస్తున్నట్లు వీడియోలో తెలిపారు.
పని వదలాలని ఉన్న వారికి కొన్ని సలహాలివ్వాలని ఉన్నట్లు రాకేశ్ చెప్పుకొచ్చారు. ఆటో డ్రైవర్ కార్పొరేట్ సంస్థలో గులామ్ పని చేయటానికి లేడంటూ శీర్షికను ఆటో వెనుక రాశారు. జీవితంలో డబ్బుల కంటే అనేక విషయాలు చాలా ముఖ్యమన్నారు. ఈ వీడియోను చాలా మంది చూసి అనేక మంది మంచిగా సందేశాలు పెడుతున్నారు. ‘మీ ఎంపిక తృప్తిగా ఉంటే చాలు, మంచి జరగాలి’ అని కామెంట్లు పెడుతున్నారు.


