బీజాపూర్: ఛత్తీస్‌గఢ్‌కు చెందిన కొందరు మావోయిస్టులు సంచలన వీడియో విడుదల చేశారు. దానిలో లొంగిపోయిన తమ సహచరులను నిందించారు. పార్టీని, ప్రజలను మోసం చేయడం ద్వారా మావోయిస్టుల అంతానికి కుట్ర పన్నుతున్నారని వారు ఆరోపించారు.
ఛత్తీస్‌గఢ్‌లోని భైరామ్‌గఢ్ ఏరియాకు చెందిన ఇద్దరు క్రియాశీల నక్సలైట్లు అక్టోబర్ 26న పోలీసుల సమక్షంలో లొంగిపోయారు. నాటి నుండి నక్సలైట్ సంస్థలలో గందరగోళం నెలకొంది. ఇదే నేపధ్యంలో పలువురు మావోయిస్టులు లొంగిపోయిన తమ సహచరులకు వ్యతిరేకంగా గోండి మాండలికంలో ఒక వీడియోను విడుదల చేశారు. ఈ వీడియో లొంగిపోయిన నక్సలైట్లను దేశద్రోహులుగా అభివర్ణించారు. పార్టీని, ప్రజలను మోసం చేసి, ఇప్పుడు తమపై ఎదురుతిరిగి, తమ జనతా ప్రభుత్వాన్ని నాశనం చేయడానికి కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు.
बीजापुर। नक्सलियों ने सरेंडर करने वाले नक्सल नेताओं के खिलाफ वीडियो जारी कर उन्हें गद्दार बताया है। कहा- पार्टी और जनता को धोखा देकर हमें ख़त्म करने की साजिश रच रहे हैं। @DistrictBijapur #Chhattisgarh #Naxalites #naxalsurrender @vijaysharmacg pic.twitter.com/SgIgPQ4gEq
— Haribhoomi (@Haribhoomi95271) November 4, 2025
లొంగిపోయిన మావోయిస్టులు మిగిలిన మావోయిస్టుల కార్యకలాపాలకు అడ్డుతగులుతున్నారని, తమ స్మారక చిహ్నాలను ధ్వంసం చేస్తున్నారని, సంస్థను రెండు వర్గాలుగా విభజిస్తూ, మావోయిస్టు భావజాలం ముగింపు గురించి మాట్లాడుతున్నారన్నారు. భైరామ్‌గఢ్ ప్రాంతంలో చురుకుగా ఉన్న నక్సలైట్ నేత కమలు పూనెం.. పోలీసుల నుంచి రూ. రెండు లక్షలు తీసుకుని లొంగిపోయాడని నక్సలైట్ల వెస్ట్ బస్తర్ డివిజన్ కమిటీ ఒక ప్రెస్ నోట్‌లో తెలియజేసింది. పూనెం అక్టోబర్ 26న బీజాపూర్ పోలీసుల ముందు లొంగిపోయాడు. ఇతను సోను,రూపేష్ బృందానికి చెందినవాడని నక్సలైట్ల పశ్చిమ బస్తర్ డివిజనల్ కమిటీ తెలిపింది.
ఇది కూడా చదవండి: ‘ఇస్కాన్’పై ఉగ్ర ముద్ర.. ‘బంగ్లా’లో ఆందోళనలు


