యాపిల్‌ మెగా ఈవెంట్‌లో‌ పీవీ సింధు: టీమ్‌ కుక్‌తో సెల్ఫీ పిక్స్‌ వైరల్‌

Badminton Champion PV Sindhu selfie with Apple CEO Tim Cook goes viral - Sakshi

Apple  Event Pv Sindhu Selfie with Tim Cook అమెరికా టెక్‌ దిగ్గజం యాపిల్‌ మెగా ఈవెంట్‌కు బ్యాడ్మింటన్ ఛాంపియన్ పీవీ సింధు హాజరైంది. యుఎస్‌లోని కుపెర్టినోలోని కంపెనీ ప్రధాన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో  మోస్ట్‌ ఎవైటెడ్‌  iPhone 15 సిరీస్‌ను లాంచ్‌ చేసిన సంగతి  తెలిసిందే. ఈ ఈవెంట్‌కు హాజరైనట్టు ఇన్‌స్టాలో షేర్‌ చేసిన సింధు   Apple CEO టిమ్ కుక్‌తో  సెల్ఫీలను కూడా  పోస్ట్‌ చేసింది. దీంతో ఈ పిక్స్‌ వైరల్‌గా మారాయి.  (గోల్డ్‌ లవర్స్‌కి తీపి కబురు: బంగారం, వెండి ధరలు పతనం)

‘‘Apple Cupertinoలో  సీఈవో టిమ్ కుక్‌ని కలుసుకోవడం మర్చిపోలేని క్షణం!  ధన్యవాదాలు, టిమ్. అద్భుతమైన ఆపిల్ పార్క్‌ని , , మిమ్మల్ని కలవడం చాలా ఆనందంగా ఉంది!’’ అంటూ రాసుకొచ్చింది. అంతేకాదు ఈ సారి మీరు భారత పర్యటనకు వచ్చినపుడు బ్యాడ్మింటన్ ఆడతాను అంటూ మరో  పోస్ట్‌లో పేర్కొంది. ఈ పోస్ట్‌లకు ఇప్పటికే సింధు అభిమానులు, అనుచరుల నుండి లైక్‌లు, కామెంట్‌లు వెల్లువెత్తాయి. మిమ్మల్ని ఈ స్థాయిలో చూడటం గర్వంగా ఉందని ఒకరు,  Apple Cupertinoలో కూడా బ్యాడ్మింటన్ సంఘం ఉంది అంటూ  మరొక వినియోగదారు  వ్యాఖ్యానించారు.

కాగా  USB-Cతో  Apple Watch Series 9 , Airpods Proతో పాటు iPhone 15 సిరీస్‌ను విడుదల చేసింది. ఐఫోన్ 15 128 జీబీ  స్టోరేజ్‌కు రూ. 79,900 నుండి ప్రారంభమైతే, ఐఫోన్ 15 ప్లస్  రూ. 89,900 నుండి ప్రారంభమవుతుంది. iPhone 15 Pro 128 జీబీ  స్టోరేజ్‌ ధర రూ. 1,34,900 , iPhone 15 Pro Max 256 జీబీ  స్టోరేజ్‌ ధర రూ. 1,59,900 నుండి ప్రారంభమవుతుంది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top