ప్రభాస్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం కల్కి 2898 ఏడీ.
ఈ మూవీలో భైరవగా డార్లింగ్ ప్రభాస్‌కు ఎంత ప్రాధాన్యత ఉందో అశ్వత్థామగా అమితాబ్ బచ్చన్‌కు అంతకన్నా ఎక్కువ ఇంపార్టెన్సే ఉంది.
ఈ మూవీలో బిగ్‌బీ తన విశ్వరూపం చూపించాడు.
జూన్ 27న విడుదలైన ఈ సినిమాను అమితాబ్ ఆలస్యంగా వీక్షించాడు.
ఆదివారం నాడు తన కుమారుడు, నటుడు అభిషేక్ బచ్చన్‌తో కలిసి కల్కి చూశాడు.
ఈ విషయాన్ని తన బ్లాగ్‌లో రాసుకొచ్చాడు.
సినిమా ఫైనల్ కట్ చూడలేదని, థియేటర్‌లోనే తొలిసారి కల్కి మూవీ చూస్తున్నట్లు తెలిపాడు.
ఈ మేరకు కొన్ని ఫోటోలు షేర్ చేశాడు.


