బీట్స్‌తో అదరగొట్టేసిన బుడ్డోళ్లు : 3 కోట్ల వ్యూస్‌, ఓ లుక్కేసుకోండి మరి! | Pune school students create music with geometry box bottle 3cr views video viral | Sakshi
Sakshi News home page

బీట్స్‌తో అదరగొట్టేసిన బుడ్డోళ్లు : 3 కోట్ల వ్యూస్‌, ఓ లుక్కేసుకోండి మరి!

Mar 11 2025 3:23 PM | Updated on Mar 11 2025 4:22 PM

Pune school students create music with geometry box bottle 3cr views video viral

‘బాల్యం బంగారు నిధి’ ఇది అందరం ఒప్పుకునే మాట. బాల్య స్మృతులు ఎవరికైనా చెప్పలేనంత ఉల్లాసాన్ని ఇస్తాయి. బాల్యం అనగానే అందమైన అనుభూతులు, అనుభవాలు ఒక్కసారిగా మనల్ని చుట్టుముడతాయి. ఎదలోతులో ఏ మూలనో నిదురించిన జ్ఞ్యాపకాలు ఒక్కసారిగా నిద్ర లేస్తాయి. చిన్నపుడు మనం చేసిన అల్లరి, చిలిపి చిలిపి చేష్టలు గుర్తొస్తాయి. బ్లాక్‌ బోర్డుపై రాసిన రాతలు, స్కూలు బెంచ్‌పై చెక్కుకున్నపేర్లు, అదేదో  సినిమాలో అన్నట్టు నచ్చిన అమ్మాయిపై పేపర్‌ బాల్‌ విసరడం, అది మాస్టార్‌కు తగిలి, వీపు పగలడం ఇలా.. ఎన్నో..ఎన్నో గుర్తుకు వస్తాయి కదా.   ఇపుడు మీరు చదవబోయే  కథనం కూడా అలాంటి ఎన్నో అనుభవాలను గుర్తు చేస్తుంది. పుణేకు చెందిన విద్యార్థుల వీడియో ఒకటి నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది.

ప్రాజెక్ట్ అస్మి ఇన్‌స్టాగ్రామ్‌లో  షేర్‌ చేసిన  వీడియో ఇపుడు సోషల్‌ మీడియాను షేక్‌ చేస్తోంది. ఇప్పటికే ఇది 3 కోట్ల వ్యూస్‌ను సొంతం చేసుకుంది. కమెంట్లు వెల్లువెత్తాయి. పూణేలోని ఒక పాఠశాల చెందిన బ్యాచ్‌ జామెట్రీ బాక్స్‌,  బెంచె మీద వాయిస్తూ అద్భుతమైన  సంగీతాన్ని సృష్టించారు.  వాటర్ బాటిల్‌ను మాత్రమే ఉపయోగించి డ్రమ్ బీట్స్‌తో అదరగొట్టేశారు.  ఒకరి తరువాత ఒకరు తమ టాలెంట్‌తో రెచ్చిపోయారు. దీంతో తరగతి గది  ఒక చిన్న కచేరీ వేదికగా మారిపోయింది.  దీంతో టీచర్లు కూడా అలా మైమరిచిపోయారు. చుట్టూ ఉన్న పిల్లలు, స్నేహితులు  చప్పట్ల మోత మోగించారు. 

చదవండి: అప్పుడు వెడ్డింగ్‌ గౌను, ఇపుడు ఎంగేజ్‌మెంట్‌ రింగ్‌ : సమంత అంత పనిచేసిందా?

అందుబాటులో ఉన్న వస్తువులను ఉపయోగించి విద్యార్థులు ఉత్పత్తి చేసే బీట్‌లు , రిథమ్‌లు భలే ఉంటాయి. వారి క్రియేటివిటీని మెచ్చుకోకుండా ఉండలేం. కల్మషం లేని లేత వయసులో వారి  ప్రతిభను ,సృజనాత్మకతను గుర్తించి ప్రోత్సహిస్తే గొప్ప ప్రతిభావంతులుగా మారతారు. మరి ఈ బాల శివమణిలకు ఎలాంటి ప్రోత్సాహం లభిస్తుందో వేచి  చూద్దాం.
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement