అప్పుడు వెడ్డింగ్‌ గౌను, ఇపుడు ఎంగేజ్‌మెంట్‌ రింగ్‌ : సమంత అంత పనిచేసిందా? | Did After Divorce From Chay Samantha remade Diamond Engagement Ring Into Pendant | Sakshi
Sakshi News home page

అప్పుడు వెడ్డింగ్‌ గౌను, ఇపుడు ఎంగేజ్‌మెంట్‌ రింగ్‌ : సమంత అంత పనిచేసిందా?

Mar 11 2025 11:18 AM | Updated on Mar 11 2025 12:10 PM

Did After Divorce From Chay Samantha remade Diamond Engagement Ring Into Pendant

టాలీవుడ్‌  స్టార్‌ హీరోయిన్‌ సమంతా రూత్ ప్రభు  మరో కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.  నటుడు నాగచైతన్యతో వివాహం,  విడాకులు తరువాత, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతోంది. సినీ పరిశ్రమలో అందం, ప్రతిభతో తానేంటో నిరూపించుకుంటూ స్టార్‌ హీరోయిన్‌గా  అభిమానుల మనసుల్లో తన చోటును సుస్థిరం చేసుకుంది.  తాజాగా సమంతాకు సంబంధించి ఒక వార్త సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. అదేంటో తెలుసుకోవాలంటే ఈ కథనం చదవాల్సిందే.

సమంత నిశ్చితార్థ ఉంగరాన్ని సరికొత్తగా మార్చేసినట్టు తెలుస్తోంది. తన ఎంగేజ్‌మెంట్‌ రింగ్‌ను లాకెట్టుగా  మార్చేసిందని తాజా నివేదికల సమాచారం. ఈ మేరకు  సూరత్‌కు చెందిన ఆభరణాల డిజైనర్ ధ్రుమిత్ మెరులియా అంచనాలు వైరల్‌గా మారాయి.  నాలుగు సంవత్సరాల వివాహం తర్వాత, ఈ జంట 2021 లో విడాకులు తీసుకుంది. విడాకుల  తీసుకున్న ఇన్నేళ్లకు ఇపుడు సమంత తన డైమండ్ రింగ్‌ను లాకెట్టుగా మార్చుకుంది. 3 క్యారెట్ల ప్రిన్సెస్-కట్ డైమండ్ రింగ్‌ను లాకెట్‌గా ఎలా మార్చుకుందో వివరిస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియోను షేర్ చేశాడు. దీన్ని క్రమం తప్పకుండా ధరిస్తోందని,  ఇది ప్రస్తుత ట్రెండ్‌ అంటూ పేర్కొన్నాడు. అయితే  దీనిపై ఎలాంటి ధృవీకరణ లేనప్పటికీ  ధ్రుమిత్ మెరులియా ఊహ మాత్రమే  అయినప్పటికీ,  ఇది ఫ్యాన్స్‌ మరియు, నెటిజనులను మనసులను కదిలించింది.

 

కాగా  2024లో, సమంత తన వెడ్డింగ్‌ గౌను  అవార్డుల వేడుక కోసం  కొత్తగా డిజైన్‌ చేయించుకుంది.  వైట్‌ వెడ్డింగ్‌ గౌనును నల్లటి సాసీ గౌనుగా మార్చి  ఫ్యాషన్ డిజైనర్ క్రేషా బజాజ్ దీనికి  న్యూలుక్‌ను  తీసుకురావడం విశేషం. దీంతో  అభిమానులు దీనిని 'రివెంజ్ డ్రెస్' అని  కూడా ట్యాగ్‌ చేశారు.  ఈ డ్రెస్‌ ఫోటోలను కూడా సమంత ఇన్‌స్టాలో పంచుకుంది. గౌను ధరించిన చిత్రాలను పంచుకుంది.  మన భూమాత రక్షణ కోసం, తన జీవన శైలిని సస్టైనబుల్‌గా మార్చుకుంటున్నట్టు వెల్లడించింది.  ఈ క్రమంలో మనం తీసుకునే ప్రతీ చిన్న నిర్ణయాత్మక చర్య చాలా ముఖ్యం.అందరూ దీన్ని కొనసాగించాలని కోరుకుంటున్నాను అంటూ పేర్కొంది. 

అంతేకాదు విడాకుల తర్వాత, సాధారణంగా ఒక అమ్మాయి 'సెకండ్ హ్యాండ్',  'ఆమె జీవితం వృధా అయింది' లాంటి ముద్రలు వేస్తారు.  ఇది ఆమెకు, ఆమె కుటుంబానికి కూడా చాలా ఇబ్బంది.  ఇక అంతా అయిపోయినట్టు, విఫలమై నట్లు భావిస్తారు. ఇది తనకు చాలా  బాధపెట్టిందని, కానీ తాను విడాకులు తీసుకున్నాననే వాస్తవాన్ని  జీర్ణించుకుంటున్నట్టు  చెప్పింది. అలాగే  తన పెళ్లి గౌనును  మార్చుకోవడం అనేది ప్రతీకారం కోసం  ఎంతమంత్రం కాదని, తన బలానికి అదొక చిహ్నమని  సమంతా స్పష్టం చేసింది. 

చదవండి: Amrutha Pranay Case Verdict : పీవోడబ్ల్యూ సంధ్య స్పందన ఇదే!…

సమంతతో విడాకుల తరువాత నాగ చైతన్య డిసెంబర్ 2024లో  నటి  శోభిత ధూళిపాళను వివాహం చేసుకున్నాడు. అలాగే  సమత  ది ఫ్యామిలీ మ్యాన్ 2 , సిటాడెల్: హనీ బన్నీ లాంటి  సిరీస్‌లతో కలిసి పనిచేసిన రాజ్ &  డీకే ద్వయంలో ఒకరైన  రాజ్ నిడిమోరుతో డేటింగ్ చేస్తోందన్న పుకార్లు బాగా వినిపిస్తున్నాయి.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement