యశవంతపుర: బెంగళూరులో మద్యం మత్తులో డెలివరీ బాయ్ యువతి ఇంట్లో రచ్చ చేశాడు. బాధిత యువతి అనేరి ఠక్కర్ ఇన్‌స్టాలో వివరించింది. ఆమె ఒక్కరే ఉండగా డెలివరీ బాయ్ వచ్చాడు. ఆమెతో అతి ప్రేమగా మాట్లాడడం మొదలుపెట్టాడు, మొబైల్‌లో చార్జింగ్ పెట్టుకుంటానని, ఇక్కడే ఉండి సిగరెట్ తాగుతానని ఆమెను ఒత్తిడి చేశాడు. ఇంట్లోకి చొరబడడానికి యత్రించాడని యువతి వాపోయింది. చివరకు ఎలాగో అతన్ని వెనక్కి పంపించినట్లు, అతడు పనిచేసే కంపెనీకి ఫిర్యాదు చేయగా, విచారణ చేస్తామని చెప్పారని పేర్కొంది.


