ఎవరైనా సులువుగా డబ్బు సంపాదించవచ్చు! | Mastering Personal Finance Practical Guide to Financial Discipline: Youth finance | Sakshi
Sakshi News home page

ఎవరైనా సులువుగా డబ్బు సంపాదించవచ్చు!

Sep 13 2025 10:28 AM | Updated on Sep 13 2025 10:36 AM

Mastering Personal Finance Practical Guide to Financial Discipline: Youth finance

పెరుగుతున్న జీవన వ్యయాలు, మార్కెట్ అస్థిరతలు, ఆర్థిక అనిశ్చితి వల్ల పర్సనల్‌ ఫైనాన్స్ అంశాలకు ప్రాధాన్యం పెరుగుతోంది. మీరు ఓ సంస్థలో ఉద్యోగిగా ఉన్నా, ఫ్రీలాన్సర్‌గా చేస్తున్నా, చిన్న వ్యాపారం సాగిస్తున్నా, గృహిణిగా ఉన్నా.. ఆర్థిక స్వాతంత్ర్యం ఎంతో ముఖ్యం. ఎలాంటి వారైనా దీర్ఘకాలంలో స్థిరంగా డబ్బు సంపాదించేలా కొన్ని మార్గాలను పరిశీలిద్దాం. అయితే కింది అంశాలను పరిశీలించిన తర్వాత క్రమశిక్షణతో వీటిని పాటించడం చాలాముఖ్యమని గమనించాలి.

ఆదాయం.. ఖర్చుల ట్రాకింగ్‌..

నెలకు కొందరు పెద్దమొత్తంలో సంపాదిస్తారు. ఇంకొందరు కాస్త తక్కువగానే ఆర్జిస్తారు. ఎంత ఆదాయం సమకూరుతున్నా ఆ డబ్బు ఎక్కడికి వెళుతుందో అర్థం చేసుకోవడం ముఖ్యం. అందుకు బడ్జెట్‌ పాటించాలి. బ్యాంకు ఖాతాలో నుంచి వెళ్లే, అందులోకి వచ్చే ప్రతి రూపాయిని ట్రాక్‌ చేయాలి. అందుకు స్ప్రెడ్ షీట్‌లు, బడ్జెట్ యాప్‌లు వంటివి ఉన్నాయి. లేదా సాధారణ నోట్ బుక్‌లోనూ రికార్డు చేయవచ్చు. ఇందులో మీ ఖర్చులను స్పష్టమైన కేటగిరీలుగా విభజించాలి.

  • నిత్యావసరాలు (అద్దె, కిరాణా సామాగ్రి, యుటిలిటీలు)

  • డిసిక్రీషనరీ స్పెండింగ్‌ (షాపింగ్, డైనింగ్)

  • పొదుపు, పెట్టుబడులు

  • ప్రతి కేటగిరీలో ఖర్చు పరిమితులను కేటాయించుకోవాలి.

ఉదాహరణకు..

కిరాణా సామాగ్రి: రూ.8,000

ఎంటర్ టైన్‌మెంట్‌: రూ.3,000

పొదుపు: రూ.5,000

  • డిస్‌క్రీషనరీ స్పెండింగ్‌ను పరిమితం చేయడం వల్ల దీర్ఘకాలంలో పెట్టుబడి పెట్టడానికి మరింత అవకాశం లభిస్తుంది.

ఎమర్జెన్సీ ఫండ్

జీవితం అనూహ్యమైనది. ఏ క్షణం ఏదైనా జరగవచ్చు. అందుకు సిద్ధంగా ఉండాలి. లేకపోతే ఉద్యోగ నష్టం, వైద్య అత్యవసర పరిస్థితులు, ఇంటి ఖర్చులు.. వంటి వాటితో ఆర్థికంగా ఇబ్బంది పడాల్సి ఉంటుంది.

ఎంత సరిపోతుంది?

కనీసం 6 నెలల విలువైన నిత్యావసర ఖర్చులు.. ఇంటి అద్దె, ఆహారం, యుటిలిటీలు, ఈఎంఐలను చెల్లించేలా కార్పస్‌ను క్రియేట్‌ చేయాలి. ఈ నిధిని అధిక వడ్డీ పొదుపు ఖాతా, స్వల్పకాలిక స్థిర డిపాజిట్ లేదా మనీ మార్కెట్ ఫండ్ వంటి లిక్విడ్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేయవచ్చు.

ఇది ఎందుకు ముఖ్యం?

దీర్ఘకాలం లక్ష్యంతో చేసే పొదుపుపై ప్రభావం పడకుండా ఆపద సమయంలో ఎమర్జెన్సీ ఫండ్ రక్షిస్తుంది. ఆర్థికంగా భారం కాకుండా, అధిక వడ్డీ రుణాలు తీసుకోకుండా భరోసా కల్పిస్తుంది.

ఇన్వెస్ట్‌మెంట్‌ ఎక్కడ చేయాలి?

సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్స్ (ఎస్‌ఐపీ) నెలవారీ చిన్న మొత్తంలో పెట్టుబడి పెట్టడానికి అనుమతిస్తాయి. అవి రెండు ముఖ్య ప్రయోజనాలను అందిస్తాయి. కాంపౌండింగ్.. మీ రాబడులపై మరింత ఆదాయాన్ని పెంచుతాయి. ధరలు తక్కువగా ఉన్నప్పుడు ఎక్కువ యూనిట్లను కొనుగోలు చేయవచ్చు. కొత్తగా పెట్టుబడి ప్రారంభించాలనుకుంటే వైవిధ్యభరితమైన ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ లేదా హైబ్రిడ్ ఫండ్లతో మొదలు పెట్టవచ్చు. ద్రవ్యోల్బణం పెరుగుతుంటే, ఈక్విటీ విలువ తగ్గుతుంటే బంగారం హెడ్జింగ్‌గా పని చేస్తుంది.

అప్పుల నిర్వహణ

అప్పు చేయడం తప్పు. తప్పని పరిస్థితుల్లో చేసిన అప్పును వెంటనే తీర్చేయాలి. క్రెడిట్ కార్డులు, వ్యక్తిగత రుణాలు తరచుగా 30% లేదా అంతకంటే ఎక్కువ వడ్డీ రేట్లను కలిగి ఉంటాయి. తిరిగి చెల్లించే క్రమంలో వీటికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలి. క్రెడిట్ కార్డు బిల్లుల్లో "కనీస చెల్లింపు" ఉచ్చులో పడకూడదు. దీంతో తర్వాతి బిల్లు సైకిల్‌లో అధికంగా వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. మొత్తం బకాయిలను పే చేయాలి.

ఇదీ చదవండి: తొమ్మిది ఎన్‌బీఎఫ్‌సీల లైసెన్స్‌లు సరెండర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement