లక్ష్యంలో 36.5 శాతానికి చేరిక
సెప్టెంబర్ చివరికి రూ.5,73,123 కోట్లు
కేంద్ర ప్రభుత్వ ద్రవ్యలోటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలలకు (ఏప్రిల్–సెప్టెంబర్) రూ.5,73,123 కోట్లుగా నమోదైంది. పూర్తి ఆర్థిక సంవత్సరానికి (2025–26) జీడీపీలో ద్రవ్యలోటు 4.4 శాతంగా (రూ.15.69 లక్షల కోట్లు) ఉంటుందని ప్రభుత్వం బడ్జెట్ అంచనాల్లో పేర్కొనడం గమనార్హం. ఈ ప్రకారం చూస్తే మొత్తం లక్ష్యంలో ద్రవ్యలోటు 36.5 శాతానికి చేరినట్టు తెలుస్తోంది.
సరిగ్గా క్రితం ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల్లో ద్రవ్యలోటు పూర్తి ఆర్థిక సంవత్సరం లక్ష్యంలో 29 శాతంగానే ఉండడం గమనించొచ్చు. ఏప్రిల్–సెపె్టంబర్ మధ్య రూ.12.29 లక్షల కోట్ల ఆదాయం పన్ను రూపంలో ప్రభుత్వానికి వచి్చంది. రూ.4.66 లక్షల కోట్లు పన్నేతర ఆదాయం కాగా, రూ.34,770 కోట్లు రుణేతర మూలధనం రూపంలో సమకూరింది. ఇందులో రూ.6.31 లక్షల కోట్లను రాష్ట్రాలకు (పన్నుల వాటా కింద) కేంద్రం బదిలీ చేసింది. క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే రూ.86,948 కోట్లు అధికంగా బదిలీ అయింది. మొత్తం వ్యయం రూ.23 లక్షల కోట్లుగా ఉంది. రెవెన్యూ వ్యయాల్లో రూ.5.78 లక్షల కోట్లు వడ్డీ చెల్లింపులకు ఖర్చు కాగా, రూ.2.02 లక్షల కోట్లు సబ్సిడీలపై వెచి్చంచింది. ప్రభుత్వ మూలధన వ్యయం 40% పెరగడాన్ని (రూ.5.7 లక్షల కోట్లు) ఇక్రా ముఖ్య ఆర్థికవేత్త అదితినాయర్ స్వాగతించారు.
ఇదీ చదవండి: ఇంట్లో కూర్చొని లక్షలు సంపాదించే బిజినెస్ ఐడియాలు


