అంచనాల్లో 52 శాతానికి ద్రవ్యలోటు  | India April-October fiscal deficit at Rs 8. 25 lakh crore | Sakshi
Sakshi News home page

అంచనాల్లో 52 శాతానికి ద్రవ్యలోటు 

Nov 29 2025 3:52 AM | Updated on Nov 29 2025 3:52 AM

India April-October fiscal deficit at Rs 8. 25 lakh crore

ఏప్రిల్‌–అక్టోబర్‌ మధ్య రూ.8,25,144 కోట్లు 

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ ద్రవ్యలోటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌ నుంచి అక్టోబర్‌ చివరికి రూ.8,25,144 కోట్లుగా నమోదైంది. పూర్తి ఆర్థిక సంవత్సరానికి జీడీపీలో ద్రవ్యలోటు 4.4 శాతం (15.69 లక్షల కోట్లు)గా ఉండొచ్చన్నది కేంద్రం అంచనా. ఇందులో మొదటి ఏడు నెలల కాలంలో 52.6 శాతానికి ద్రవ్యలోటు చేరినట్టు తెలుస్తోంది. 

క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే కాలానికి ద్రవ్యలోటు అంచనాల్లో 46.5 శాతంగా ఉండడం గమనార్హం. ప్రబుత్వ వ్యయాలు–ఆదాయం మధ్య అంతరమే ద్రవ్యలోటు. కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ అకౌంట్స్‌ (సీజీఏ) విడుదల చేసిన డేటా ప్రకారం.. అక్టోబర్‌ చివరికి ప్రభుత్వానికి రూ.18 లక్షల కోట్ల ఆదాయం వచి్చంది. 

ఇందులో రూ.12.74 లక్షల కోట్లు పన్ను రూపంలో రాగా, రూ.4.89 లక్షల కోట్లు పన్నేతర ఆదాయం. రుణేతర నిధుల వసూళ్లు రూ.37,095 కోట్లుగా ఉన్నాయి. ఇందులో రాష్ట్రాలకు రూ.8,34,957 కోట్లను కేంద్రం బదిలీ చేసింది. వ్యయాలు రూ.26.25 లక్షల కోట్లుగా ఉన్నాయి. ఇందులో రూ.20 లక్షల కోట్లు రెవెన్యూ వ్యయాలు కాగా, రూ.6.17 లక్షల కోట్లు మూలధన వ్యయాలకు సంబంధించి ఉన్నాయి. 

Advertisement
 
Advertisement
Advertisement