ఆరోగ్య సేవలకు టానిక్‌ ఇస్తారా..? | Health experts hope for less GST on medical goods | Sakshi
Sakshi News home page

ఆరోగ్య సేవలకు టానిక్‌ ఇస్తారా..?

Jan 31 2025 6:01 AM | Updated on Jan 31 2025 1:48 PM

 Health experts hope for less GST on medical goods

మరిన్ని కేటాయింపులు చేయాలి 

జీడీపీలో 2.5 శాతానికి పెంచాలి 

పరిశోధన, అభివృద్ధికి ప్రోత్సాహకాలు కల్పించాలి 

 ఎంఎస్‌ఎంఈలకు రుణ లభ్యతను పెంచాలి 

నిపుణుల సూచనలు 

ప్రజలందరికీ ఆరోగ్య సదుపాయాలు మరింతగా అందుబాటులోకి తీసుకొచ్చేందుకు వీలుగా.. ప్రజారోగ్యంపై ప్రభుత్వం మరింత దృష్టి సారించడంతోపాటు కేటాయింపులను గణనీయంగా పెంచాలని ఈ రంగానికి చెందిన నిపుణులు కోరుతున్నారు. ప్రభుత్వరంగంలో కొత్త ఆస్పత్రుల ఏర్పాటుతోపాటు, ప్రైవేటు రంగంలో ఆస్పత్రులకు సైతం పలు రకాల ప్రయోజనాలతో ప్రోత్సాహం అందించాలన్న సూచనలు వస్తున్నాయి. వైద్య సేవలు, పరికరాలు, ఔషధాలపై జీఎస్‌టీని తగ్గించాలన్న డిమాండ్లు నెలకొన్నాయి. మరోవైపు 11 కోట్ల మందికి ఉపాధి కలి్పస్తూ జీడీపీలో 30–35 శాతం వాటా కలిగిన ఎంఎస్‌ఎంఈ రంగం సైతం విధానపరమైన మద్దతు చర్యలను ఆశిస్తోంది.  

అంచనాలు–డిమాండ్లు.. 
→ 2024–25 బడ్జెట్‌లో ఆరోగ్య రంగానికి రూ.90,171 కోట్లు కేటాయించారు. అత్యాధునిక ఆరోగ్య సదుపాయాలు మరింత మందికి అందుబాటులోకి రావాలంటే జీడీపీలో కేటాయింపులు 2.5 శాతానికి పెంచాలి. 
→ ఒకరికి వినియోగించిన లేదా పునరి్వనియోగానికి అనుకూలంగా మార్చిన (రిఫర్బిష్డ్) వైద్య పరికరాల విషయంలో తగిన నియంత్రపరమైన విధానాల తీసుకురావడం ద్వారా.. ఈ పరికరాలు సమాజంలో వైద్య సదుపాయాలు అంతగా అందని వర్గాలకు చేరువ చేయొచ్చు. 
→ వ్యాధి నివారణ ముందస్తు ఆరోగ్య చికిత్సలు, టెస్ట్‌లకు పన్నుల ప్రయోజనాలు కల్పించాలి. వైద్య, ఆరోగ్య సేవలు, జీవనశైలి వ్యాధులు(మధుమేహం, స్థూలకాయం తదితర) ప్రాణాధార ఔషధాలపై జీఎస్‌టీని తగ్గించాలి. 
→ గత బడ్జెట్లలో టెలీ మెడిసిన్‌కు మద్దతు లభించింది. నేషనల్‌ డిజిటల్‌ హెల్త్‌ మిషన్‌ (ఎన్‌డీహెచ్‌ఎం)ను సైతం కేంద్రం ప్రవేశపెట్టింది. 2025 బడ్జెట్‌లోనూ హెల్త్‌ యాప్‌లు, ఏఐ ఆధారి డయాగ్నోస్టిక్స్‌ టూల్స్‌ తదితర డిజిటల్‌ హెల్త్‌ సేవల విస్తరణ దిశగా చర్యలు ఉంటాయని అంచనా. 
→ ఆస్పత్రులు, డయాగ్నోస్టిక్స్‌ కేంద్రాల విషయంలో ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ)  బలోపేతం చేసే దిశగా చర్యలు అవసరం.  
→ ఫార్మాస్యూటిక్సల్, వైద్య పరికరాల కోసం దేశం మొత్తానికి ఒకే నియంత్రణ సంస్థను ఏర్పాటు చేయాలి.  
→ పరిశోధన, అభివృద్ధికి పెద్ద ఎత్తున నిధులు, ప్రోత్సాహకాలు కల్పించాలి. ప్రభుత్వం నుంచి పరిశోధనా ప్రోత్సాహకాలు ప్రస్తుతం ఇనిస్టిట్యూషన్లు, విద్యా కేంద్రాలకే వెళుతున్నాయి.
→ క్లినికల్, డిస్కవరీ రీసెర్చ్‌ కార్యక్రమాల్లో పాల్గొనే కాంట్రాక్ట్‌ రీసెర్చ్‌ సంస్థలకు (సీఆర్‌వోలు) నిధులు, ప్రోత్సాహకాలు ఇవ్వాలి.
 

ఎంఎస్‌ఎంఈలకు రుణ విస్తృతి అవసరం
→ సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థలు (ఎఎస్‌ఎంఈలు) కృత్రిమ మేధ (ఏఐ) టెక్నాలజీతో అనుసంధానం కావాల్సి ఉంటుంది. కనుక ఈ రంగంలోని కారి్మకులకు డిజిటల్‌ నైపుణ్యాల కల్పన, ఏఐ ఆధారిత శిక్షణ కార్యక్రమాలను అందించాలి.  
→ ఎఎస్‌ఎంఈలకు నిధుల లభ్యత పెద్ద సమస్యగా ఉంది. అత్యవసర క్రెడిట్‌ గ్యారంటీ సహా పలు రకాల పథకాలను ప్రభుత్వం తీసుకొచ్చినప్పటికీ ఆచరణలో లోపం నెలకొంది. దీంతో టైర్‌ 3, 4, గ్రామీణ ప్రాంతాల్లోని ఎంఎస్‌ఎంఈలకు రుణాల లభ్యత కష్టంగానే ఉంది. ఏఐ ఆధారిత రుణ దరఖాస్తుల మదింపు, రిస్క్‌ ప్రొఫైలింగ్‌తో రుణ లభ్యతను విస్తృతం చేయొచ్చు.  
→ తయారీ విస్తరణకు, తక్కువ వడ్డీరేట్లపై రుణాలు అందించాలి.
 
– సాక్షి, బిజినెస్‌ డెస్క్‌

Advertisement
 
Advertisement
Advertisement