తెలంగాణకు మేలు చేసే బడ్జెట్‌ | Budget allocations to Telangana increased from last year: Kishan Reddy | Sakshi
Sakshi News home page

తెలంగాణకు మేలు చేసే బడ్జెట్‌

Feb 2 2026 1:57 AM | Updated on Feb 2 2026 1:57 AM

Budget allocations to Telangana increased from last year: Kishan Reddy

హైదరాబాద్‌: తెలంగాణకు ఈ బడ్జెట్‌ చాలావిధాలుగా మేలు చేస్తుంది. 2025–26లో పన్నుల వాటాగా తెలంగాణకు రూ.29,280 కోట్లు రాగా, 2026–27 ఆర్థిక సంవత్సరానికి 13.5 శాతం వృద్ధితో రూ.33,180 కోట్లను కేటాయించారు. దేశవ్యాప్తంగా ప్రకటించిన 7 హైస్పీడ్‌ రైల్‌ కారిడార్లలో మూడు హైదరాబాద్‌ నుంచే ప్రారంభం కానుండటం గర్వకారణం. బయోఫార్మా ‘శక్తి’కార్యక్రమం ద్వారా హైదరాబాద్‌ ఫార్మా, వ్యాక్సిన్‌ క్యాపిటల్‌గా మరింత బలోపేతం కానుంది. గ్రామీణాభివృద్ధిలో భాగంగా వీబీ–జీ రామ్‌జీకి నిధులు పెంచారు.

ఎరువుల సబ్సిడీకి అదనంగా రూ.7 వేల కోట్లు కేటాయించి మొత్తం రూ.1.26 లక్షల కోట్లు మంజూరు చేశారు. ఇందులో సింహభాగం తెలంగాణకే దక్కనుంది. టెక్స్‌–ఇకో కార్యక్రమం.. వరంగల్‌లో ఏర్పాటు కానున్న కాకతీయ మెగా టెక్స్‌టైల్‌ పార్క్‌కు కీలకంగా మారనుంది. తెలంగాణలో 42 రైల్వే స్టేషన్ల రీమోడలింగ్‌తోపాటు భవిష్యత్‌లో మూడు హైస్పీడ్‌ రైళ్లు రానున్నాయి. ఎంఎస్‌ఎంఈల కోసం రూ.10 వేల కోట్ల గ్రోత్‌ ఫండ్‌ కేంద్రం ప్రకటించింది. దీంతో తెలంగాణలోని 38 లక్షల ఎంఎస్‌ఎంఈలకు లబ్ధి చేకూరనుంది.  – కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి 

Advertisement
 
Advertisement
Advertisement