ఒకప్పుడు నా కుటుంబానిది కూడా అదే పరిస్థితి: రాఘవ లారెన్స్ ఎమోషనల్ | Raghava Lawrence Emotional tweet about A student Life Struggle | Sakshi
Sakshi News home page

Raghava Lawrence: నా కుటుంబం కూడా అదే పరిస్థితి: రాఘవ లారెన్స్ ఎమోషనల్

Aug 18 2025 10:36 AM | Updated on Aug 18 2025 11:11 AM

Raghava Lawrence Emotional tweet about A student Life Struggle

కోలీవుడ్ హీరోలు సమాజ సేవలో ఎప్పుడు ముందుంటారు. కొన్నేళ్లుగా సూర్య తన అగరం ఫౌండేషన్ ద్వారా ఎంతోమంది విద్యార్థులకు సాయం అందిస్తున్నారు. తన వంతా సాయం చేస్తూ పేద విద్యార్థులను డాక్టర్స్‌, ఇంజినీర్స్‌ను చేస్తున్నారు. అదే బాటలో మరో స్టార్‌ హీరో లారెన్స్‌ కూడా దూసుకెళ్తున్నారు. ఎక్కడా ఎవరు ఇబ్బందుల్లో ఉన్నా వెంటనే స్పందించి మానవత్వాన్ని చాటుకుంటున్నారు. తాను స్థాపించిన మాత్రం ఫౌండేషన్‌ ద్వారా ఎంతోమందికి సాయమందిస్తున్నారు. తాజాగా ఓ పేద విద్యార్థిని కష్టాలు చూసిన ఆయన చలించిపోయారు.

ఓ తండ్రి తన కూతురి చదువుకోసం తన భార్య(లేట్) మంగళసూత్రాన్ని తాకట్టుపెట్టడం తనను ఎమోషనల్‌గా కదిలించిందని రాఘవ లారెన్స్ ట్వీట్ చేశారు. ఎందుకంటే నా కుటుంబం కూడా ఒకప్పుడు ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొందని గుర్తు చేసుకున్నారు. అందుకే ఆ మంగళసూత్రాన్ని అతనికి వెనక్కి ఇప్పించి.. ఆ కుటుంబానికి అండగా నిలిచానని ట్వీట్‌లో రాసుకొచ్చారు. అది కేవలం బంగారం మాత్రమే కాదని.. అతని భార్య విలువైన జ్ఞాపకం అని రాఘవ లారెన్స్‌ పోస్ట్ చేశారు. ఈ రోజు తన హృదయం చాలా సంతోషంతో నిండిపోయిందన్నారు.
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement