లగ్జరీ వాచ్‌ గిఫ్ట్‌ ఇచ్చిన హీరోయిన్‌.. ఎన్ని లక్షలంటే? | Kalyani Priyadarshan Gift Luxuary Watch to Nimish Ravi | Sakshi
Sakshi News home page

రూ.300 కోట్లకు చేరువలో మూవీ.. లగ్జరీ వాచ్‌ గిఫ్ట్‌ ఇచ్చిన హీరోయిన్‌

Oct 3 2025 2:08 PM | Updated on Oct 3 2025 3:40 PM

Kalyani Priyadarshan Gift Luxuary Watch to Nimish Ravi

హీరోయిన్‌ కల్యాణి ప్రియదర్శన్‌ మాలీవుడ్‌లో సెన్సేషన్‌గా మారింది. ఆమె ప్రధాన పాత్రలో నటించిన కొత్త లోక: చాప్టర్‌ 1 బాక్సాఫీస్‌ వద్ద అద్భుతాలు సృష్టిస్తోంది. మలయాళ సినీ చరిత్రలో అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా ఇప్పటికే రికార్డుకెక్కింది. ఇప్పటివరకు రూ.294 కోట్లు అందుకున్న ఈ మూవీ త్వరలోనే రూ.300 కోట్ల క్లబ్‌లో చేరనుంది. అరుణ్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని దుల్కర్‌ సల్మాన్‌ నిర్మించారు. జేక్స్‌ బిజాయ్‌ సంగీతం అందించగా నిమిష్‌ రవి (Nimish Ravi) సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించాడు.

చేతి గడియారం
తాజాగా నిమిష రవికి కల్యాణి ప్రియదర్శన్‌ ఖరీదైన బహుమతినిచ్చింది. రూ.9.8 లక్షల విలువైన చేతి గడియారాన్ని కానుకగా ఇచ్చింది. ఈ వాచ్‌ను ధరించిన రవి.. ఈమేరకు ఓ ఫోటో షేర్‌ చేశాడు. ప్రియమైన కల్యాణి, ఈ కానుక ఇచ్చినందుకు థాంక్యూ సో మచ్‌.. ఎప్పుడూ కష్టపడి పనిచేస్తే ఫలితం దానంతటదే వస్తుందనడానికి లోక సినిమాయే నిదర్శనం. వాచ్‌ చూసుకున్నప్పుడల్లా ఈ లైన్‌ గుర్తు చేసుకుంటూ ఉంటాను. నిజమైన హార్డ్‌ వర్క్‌కు ఇదొక బహుమానం అని రాసుకొచ్చాడు.

 

 

చదవండి: బాపు.. ఈ బతుకొద్దే, నా భార్య నరకం చూపిస్తోంది: నటుడి సెల్ఫీ వీడియో

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement