
జానపద ఇండస్ట్రీలో విషాదం చోటు చేసుకుంది. నటుడు గడ్డం రాజు (Gaddam Raju) సెప్టెంబర్ 29న ఆత్మహత్య చేసుకున్నాడు. భార్య టార్చర్ వల్లే చనిపోతున్నానంటూ సెల్ఫీ వీడియో తీసుకుని ప్రాణాలు వదిలాడు. తన స్వస్థలమైన పెద్దపల్లిలో ఆయన అంత్యక్రియలు జరిగాయి. రాజుది ప్రేమపెళ్లి కాగా, వీరి వివాహమై ఆరు నెలలే అవుతోంది. పెద్ద బతుకమ్మ పండక్కి భార్య కోసం కొన్న చీరతోనే ఉరి వేసుకుని చనిపోయాడు. తన సెల్ఫీ వీడియోలో ఏముందంటే.. 'అమ్మా, బాపు.. బతకలేకపోతున్నా.. ఇంట్లో ఊకె (నిత్యం) గొడవలు అవుతున్నాయి. టార్చర్ అనిపిస్తోంది. మిమ్మల్ని ఊకె తిడ్తది. ఇల్లరికం వచ్చినట్లయిపోయింది నా పరిస్థితి.
భార్య టార్చర్
అన్నా, వదిన.. పిల్లలు జాగ్రత్త. సౌందర్య.. మంచిగ బతుకు. నీలాంటిదానికి మొగోళ్లు సెట్ కారు. నువ్వన్నమాటలకు మెంటల్ టార్చర్ అయితుంది. పెళ్లయినప్పటి నుంచి టార్చరే! ఈ బతుకు బతకబుద్ధయితలేదు. పండక్కి నా భార్యకు చీర కొన్నా.. డబ్బుల్లేవని నేను డ్రెస్ కూడా కొనుక్కోలే.. అమ్మా, బాపు బై' అని కన్నీళ్లు పెట్టుకున్నాడు. రాము.. కాటి కట్టెల పాలాయనే బ్రతుకు, సీత, నా ప్రాణమే నిన్ను కోరితే.. వంటి పలు లవ్ ఫెయిల్యూర్ సాంగ్స్‌లో నటించాడు.
ముఖ్య గమనిక: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com
చదవండి: వైవా హర్ష ఇంట్లో ఇన్ని కార్లు, బైక్సా? ఇదంతా మీవల్లేనంటూ..