నేడు ఏఏఐ బృందం పర్యటన
రామగుండం: అంతర్గాం ప్రాంతంలో ఎయిర్‌పోర్ట్ ఏర్పాటుకు అవసరమైన ప్రీ ఫిజిబిలిటీపై అధ్యయనం కోసం ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఏఏఐ) ప్రతినిధులు బృందం గురువారం పర్యటిస్తుంది. ఉదయం 9 గంటలకు ప్రతినిధులు అంతర్గాం చేరుకుంటారు. అన్ని ప్రభుత్వ విభాగాల అధికారులు అందుబాటులో ఉండాలని కలెక్టర్ శ్రీహర్ష ఆదేశించారు.
సైబర్ నేరాలపై అప్రమత్తం
జ్యోతినగర్(రామగుండం): సైబర్ నేరాలపై అ ధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని దక్షిణ ప్రాంత సీఐఎస్‌ఎఫ్ ఇన్‌స్పెక్టర్ జనరల్(ఐజీ)ఎస్‌ఆర్ శరవణన్ సూచించారు. మల్కాపూర్ రోడ్డులోని సీఐఎస్‌ఎఫ్ బ్యారక్స్‌లో బుధవారం ఏర్పాటు చేసిన సైనిక సమ్మేళనంలో ఆ యన మాట్లాడారు. వృత్తి నైపుణ్యం, క్రమశిక్షణ పెంచుకుని అంకితభావంతో పనిచేయాలన్నా రు. అనంతరం ఎన్టీపీసీ ప్రాజెక్టులోని డ్యూటీ పోస్టులు సందర్శించారు. భద్రతా ఏర్పాట్లు బా గున్నాయని సీఐఎస్‌ఎఫ్ సిబ్బందిని అభినందించారు. సీఐఎస్‌ఎఫ్ యూనిట్ సీనియర్ క మాండెంట్ అరవింద్‌కుమార్ పాల్గొన్నారు.
పనితీరుకు పురస్కారం
పెద్దపల్లిరూరల్/పెద్దపల్లి: జిల్లా ప్రభుత్వ ఆస్ప త్రిలోని సిబ్బందికి పనితీరు ఆధారంగా స్టార్ పెర్పార్మర్ అవార్డు అందిస్తున్నామని సూపరింటెండెంట్ శ్రీధర్ తెలిపారు. ఇందులో విజ్జుభా య్ అనే స్టాఫ్ నర్స్ మెరుగైన పనితీరు ప్రదర్శించడంతో బుధవారం అవార్డు అందించిన ట్లు పేర్కొన్నారు. ఆర్‌ఎంవో విజయ్‌కుమార్, నర్సింగ్ సూపరింటెండెంట్ జమున ఉన్నారు.
విద్యార్థుల సృజన అద్భుతం
జ్యోతినగర్(రామగుండం): ఎన్టీపీసీ జెడ్పీ హై స్కూల్‌లో రెండోరోజు బుధవారం చేపట్టిన సై న్స్ ప్రదర్శన ఆకట్టుకుంది. వివిధ పాఠశాలల విద్యార్థులు తాము తయారు చేసిన ప్రాజెక్టులు ప్రదర్శించారు. వాటిని పరిశీలించిన న్యాయ ని ర్ణేతలు.. ఆ తర్వాత మాట్లాడుతూ విద్యార్థుల సృజనాత్మకత, సైన్స్ ఆవిష్కరణలు బాగున్నా యన్నారు. డీసీఈబీ కార్యదర్శి హనుమంతు, రామగుండం, ముత్తారం, పాలకుర్తి, పెద్దపల్లి ఎంఈవోలు మల్లేశం, హరిప్రసాద్, విమల, సురేంద్రకుమార్, హెచ్‌ఎంలు స్వర్ణలత, ఆగ య్య, ఓదెలు, మల్లారెడ్డి పాల్గొన్నారు.
క్వింటాల్ పత్తి రూ.7,231
పెద్దపల్లిరూరల్: స్థానిక వ్యవసాయ మార్కెట్‌లో బుధవారం పత్తి క్వింటాల్‌కు గరిష్టంగా రూ.7,231 ధర పలికింది. కనిష్టంగా రూ. 6,011, సగటు రూ.7,011గా ధర నమోదైందని మార్కెట్ ఇన్‌చార్జి కార్యదర్శి ప్రవీణ్‌రెడ్డి తెలిపారు. జిల్లాలోని పలు ప్రాంతాలకు చెందిన రైతులు తీసుకొచ్చిన 612 క్వింటాళ్ల పత్తి కొనుగోలు చేసినట్లు ఆయన వివరించారు.
పుణ్యక్షేత్రాలకు ఆర్టీసీ బస్సు
గోదావరిఖనిటౌన్: కర్ణాటకలోని వివిధ పుణ్యక్షేత్రాలకు గోదావరిఖని నుంచి ఆర్టీసీ బస్సు న డిపిస్తామని డిపోమేనేజర్ నామభూషణం తెలిపారు. ఈనెల 6న సూపర్ లగ్జరీ బయలు దేరుతుందన్నారు. యాత్రలో హంపి, గోకర్ణ, ము రుడేశ్వర, ఉడిపి, శృంగేరి, ధర్మస్థల, కుక్కేసుబ్రహ్మణ్య, మంత్రాలయం దర్శనం ఉంటుంద న్నారు. పెద్దలకు రూ.6,600, పిల్లలకు రూ. 5,000 చార్జీ నిర్ణయించినట్లు వివరించారు. అలాగే 15న అరుణాచలం యాత్రలో భాగంగా కాణిపాకం, అరుణాచలం, శ్రీరంగం, పళని, పాతాళశంభో, మధురై, రామేశ్వరం, విష్ణుకంచి, శివకంచి, జోగులాంబ దర్శనం ఉంటుందన్నారు. పెద్దలకు రూ.8,000, పిల్లలకు రూ. 6,000 చార్జీ నిర్ణయించినట్లు వివరించారు.
అమరుల ఆశయాలు సాధించాలి
పెద్దపల్లి: తెలంగాణ ఉద్యమంలో అమరులైన వారి ఆశయాలు సాధించాలని విశ్వబ్రాహ్మణ సంఘం జిల్లా అధ్యక్షుడు సురేందర్ కోరారు. స్థానిక అమరవీరుల స్తూపం వద్ద అమరుడు శ్రీకాంతచారి వర్ధంతిని బుధవారం నిర్వహించారు. శ్రీమన్నారాయణ, సంపత్ ఉన్నారు.
నేడు ఏఏఐ బృందం పర్యటన
నేడు ఏఏఐ బృందం పర్యటన
నేడు ఏఏఐ బృందం పర్యటన


