ఎన్నికలకు బందోబస్తు
పెద్దపల్లిరూరల్: పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు అందరూ సహకరించాలని డీ సీపీ భూక్యా రాంరెడ్డి కోరారు. అప్పన్నపేటలో బు ధవారం నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను ఏసీపీ కృష్ణ, సీఐ ప్రవీణ్‌కుమార్‌తో కలిసి డీసీపీ పరిశీలించా రు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పో లీస్ బందోబస్తు ఏర్పాటు చేశామని తెలిపారు. ఎన్నికల ముసుగులో ఇబ్బందులు సృష్టిస్తే కఠినంగా వ్యవహరిస్తామని ఆయన హెచ్చరించారు.
బసంత్‌నగర్ ఠాణా తనిఖీ
పాలకుర్తి(రామగుండం): బసంత్‌నగర్ ఠాణాను డీసీపీ భూక్యా రాంరెడ్డి తనిఖీ చేశారు. రికార్డులు పరిశీలించి కేసుల వివరాల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. స్థానిక ఎన్నికల నేపథ్యంలో సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచించారు. ఏసీపీ కృష్ణ, సీఐ ప్రవీణ్‌కుమార్, ఎస్సై శ్రీధర్ ఉన్నారు.


