కుళ్లిన ఆహారం.. జరభద్రం
రోజుల తరబడి నిల్వచేసిన పదార్థాలు.. కుళ్లిన ఆహారం.. ఆపై కల్తీచేస్తున్న భోజనం.. నిబంధనలు అతిక్రమించి విక్రయం.. జిల్లాలోని కొన్ని రెస్టారెంట్, హోటల్ నిర్వాహకుల నిర్వాకం ఇది. బాధితులు చేసిన ఫిర్యాదులతోనే ఇవి వెలుగులోకి రాలేదు. సంబంధిత శాఖ అధికారుల తనిఖీల్లోనూ బట్టబయలైన వాస్తవం ఇది.
కోల్‌సిటీ (రామగుండం): ఆరోగ్యమే మహాభాగ్యం. కానీ, ప్రస్తుతం కల్తీ, కుళ్లిన ఆహార పదార్థాలు తిని జిల్లావాసులు చాలామంది అనారోగ్యానికి గురవు తున్నారు. పేరుగాంచిన రెస్టారెంట్లలో నిల్వచేసిన మాంసం, ఇతర ఆహార పదార్థాలు తినేందుకు వెళ్లేవారికి వడ్డించి వ్యాధులు అంటగడుతున్నారు కొందరు రెస్టారెంట్, హోటళ్ల నిర్వాహకులు.
రోజుల తరబడి నిల్వ
రామగుండం నగరంలోని పలు రెస్టారెంట్లలో ఇటీవల తనిఖీలు చేసిన అధికారులు.. అక్కడి పరి స్థితులు చూసి కంగుతున్నారు. వంటశాలల్లో పరిశుభ్రత లోపించడాన్ని గుర్తించారు. ఫ్రిజ్‌లలో రోజుల తరబడి నిల్వచేసిన ఆహార పదార్థాలను వారు గమనించారు. అసలే వ్యాధుల కాలం. ఈ నేపథ్యంలో ఇలాంటి ఆహార పదార్థాలు తింటే ప్రాణాలు పోయే ప్రమాదం ఉందని ప్రజలు ఆందోళన చెందుతున్నా రు. కేవలం లాభార్జనే ధ్యేయంగా ఆయా రెస్టారెంట్లు, హోటళ్ల నిర్వాహకులు వ్యవహరిస్తున్నారనే ఆగ్రహం జిల్లావాసుల్లో వ్యక్తమవుతోంది.
పేరుగాంచిన హోటళ్లలోనూ..
జిల్లాలోని రామగుండం నగరంతోపాటు పెద్దపల్లి, సుల్తానాబాద్, మంథని మున్సిపాలిటీల పరిధిలో సుమారు వెయ్యికిపైగా హోటళ్లు ఉన్నాయి. పేరుకే పెద్దహోటళ్లు. ధరలు కూడా అదేస్థాయిలో ఉంటా యి. కానీ.. ఆహారం విషయానికి వస్తే అంతా కల్తీ యే. రెస్టారెంట్లు, హోటళ్లలోని ఆహారం తింటే వ్యాధుల బారిన పడి ఆస్పత్రులకు పరుగులు తీ యాల్సిందేనని పలువురు ఆందోళన చెందుతున్నా రు. చాలారెస్టారెంట్ల నిర్వాహకులు.. నిల్వచేసిన ఆహారాన్నే మళ్లీ వండి వడ్డిస్తున్నారు. ఫ్రిజ్‌లలో రో జుల తరబడి నిల్వ ఉంచిన చికెన్, మటన్, రసాయనాలతో కూడిన కుళ్లిన ఫుడ్‌ను వండి కస్టమర్లకు వడ్డిస్తున్నట్లు సమాచారం. ఫ్రిజ్‌లో నిల్వచేస్తున్న ఆహార పదార్థాలు దుర్వాసన రాకుండా వాటిలో రసాయనాలు కలుపుతున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
అపరిశుభ్రంగా వంటగదులు..
జిల్లాల్లోని పలు రెస్టారెంట్లు, హోటళ్లు, బార్ల కిచెన్లు అపరిశుభ్ర వాతావరణంలో ఉంటున్నాయి. గడువు ముగిసిన ఆహార పదార్థాలు, అపరిశుభ్రమైన కిచె న్, నిల్వ ఉంచిన మాంసం, కూరగాయలు వండి వ డ్డిస్తున్నారని ఆరోపణలున్నాయి. ఇటీవల పలు హో టళ్లలో భోజనంలో బొద్దింకలు సైతం వచ్చిన ఘటనలు ప్రజల్లో ఆందోళన రేకెత్తిస్తున్నాయి. ఫుడ్ అధికారుల పర్యవేక్షణ లేకపోవడమే దీనికి ప్రధాన కా రణమని విమర్శలు వస్తున్నాయి. నిత్యం తనిఖీలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. హోటళ్లు, రెస్టారెంట్లలో ఆహార పదర్థాల తనిఖీపై వివరాలు తెలుసుకోవడానికి జిల్లా ఫుడ్ ఇన్‌స్పెక్టర్‌ను ఫోన్‌లో సంప్రదించగా.. సమాధానం ఇవ్వలేదు.
రెస్టారెంట్లు, హోటళ్లలో నిల్వచేసిన పదార్థాలు
ఎక్కడా కానరాని ఫుడ్ ఇన్‌స్పెక్టర్ల తనిఖీలు
బల్దియా అధికారుల మొక్కుబడి సోదాలు
అనారోగ్యం పాలవుతున్న జిల్లావాసులు
కుళ్లిన ఆహారం.. జరభద్రం


