బైపాస్ రోడ్డు కోసం భూసేకరణ
పెద్దపల్లి/పెద్దపల్లిరూరల్: జిల్లా కేంద్రమైన పెద్దపల్లి పట్టణాభివృద్ధిలో భాగంగా ప్రభుత్వం బైపాస్ రోడ్డు మంజూరు చేసిందని, అందుకు అవసరమైన భూమి కోసం అధికారులు ఎంజాయ్‌మెంట్ సర్వే నిర్వహిస్తారని కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. పెద్దపల్లి మండలం అప్పన్నపేట గ్రామ శివారు ప్రాంతంలో బైపాస్‌రోడ్డు నిర్మాణం కోసం అవసరమైన భూమిని కలెక్టర్ శ్రీహర్ష బుధవారం పరిశీలించారు. రైతులకు పరిహారం అందించిన తర్వాతే భూసేకరణ చేపడతామని ఆయన అన్నారు. భూసేకరణపై రైతులకు ఏమైనా అభ్యంతరాలు ఉంటే వాటిని పరిష్కరించిన తర్వాతే భూసేకరణ ప్రక్రియ ముందుకు సాగుతుందని తెలిపారు. ఎవ రూ అనవసరంగా ఆందోళన పడొద్దని కలెక్టర్ సూ చించారు. ఆయన వెంట ఆర్డీవో గంగయ్య, ఆర్ అండ్ బీ ఈఈ భావ్‌సింగ్, ఇన్‌చార్జి తహసీల్దార్ వి జేందర్, సర్వేయర్లు, అధికారులు పాల్గొన్నారు.
మా భూములు లాక్కుంటారా?
తమకున్న కొద్దిపాటి భూమిలో ఎల్లంపల్లి ప్రాజెక్టు పైప్‌లైన్ కోసం ఇప్పటికే కొంత ఇచ్చామని, ఇప్పు డు చెప్పాపెట్టకుండా బైపాస్ రోడ్డు కోసమని తమ భూముల్లో హద్దులు ఏర్పాటు చేయడం సరికాదని అప్పన్నపేట గ్రామ రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. ఎమెల్యే విజయరమణారావు, కలెక్టర్ కో య శ్రీహర్ష దృష్టికి తీసుకెళ్లి తమకు అన్యాయం చేయవద్దని వేడుకున్నామని బాధిత రైతులు మందల రాజిరెడ్డి, పిడుగు రాయలింగు, శ్రీనివాస్, కటకం రాజయ్య, పోలం లక్ష్మయ్య, బోయిని రాజేశం, దాడి రాజయ్య, బాలకృష్ణ, ఆలేటి రాజు, మెండె జక్కులు తదితరులు తెలిపారు.
క్రమం తప్పకుండా హాజరవ్వాలి
దివ్యాంగులు భవిత కేంద్రానికి క్రమం తప్పకుండా హాజరవ్వాలని కలెక్టర్ శ్రీహర్ష సూచించారు. స్థానిక జెడ్పీ హైస్కూల్‌లోని కొత్త భవిత కేంద్రాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. వారంలో రెండుసార్లు దివ్యాంగ విద్యార్థులకు ఫిజియోథెరపీ చేస్తారని అన్నారు. ఇందులో చదువుకునే వారికి రూ.5 వేల స్కాలర్‌షిప్‌ను ప్రభుత్వం అందిస్తుందని తెలిపారు. మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్, డీఈవో శారద, ఎంఈవో సురేందర్‌కుమార్, ఎస్‌వో కవిత, ఐఆర్‌పీలు సంధ్యారాణి, రజని పాల్గొన్నారు.
అభ్యంతరాలు పరిష్కరిస్తాం
కలెక్టర్ కోయ శ్రీహర్ష వెల్లడి
అప్పన్నపేట శివారులో స్థల పరిశీలన


