'అతని వివరాలు తెలిస్తే చెప్పండి.. లక్ష రూపాయలు ఇస్తా' | Raghava Lawrence Reacts 80-Years-Old Man Selling Sweets In Train | Sakshi
Sakshi News home page

Raghava Lawrence: 'అతని వివరాలు తెలిస్తే చెప్పండి.. లక్ష రూపాయలు ఇస్తా'

Sep 11 2025 3:37 PM | Updated on Sep 11 2025 4:15 PM

Raghava Lawrence Reacts 80-Years-Old Man Selling Sweets In Train

కోలీవుడ్ స్టార్‌ హీరో రాఘవ లారెన్స్‌ సినిమాలు మాత్రమే కాదు.. సమాజ సేవలో దూసుకెళ్తున్నారు. ఎవరైనా ఇబ్బందుల్లో ఉన్నారని తనకు తెలిసిన మరుక్షణమే వెళ్లి దేవుడిలా సాయం చేస్తున్నారు. ఇప్పటికే చాలామంది పేద రైతులకు, విద్యార్థులకు తనవంతుగా ఆర్థికంగా అండగా నిలిచారు. ఇటీవలే  పూరి గుడిసెలో జీవిస్తున్న ఓ దివ్యాంగురాలు శ్వేత కుటుంబానికి స్కూటీ బహుమతిగా ఇచ్చాడు.

ఇది జరిగిన మూడు రోజుల్లోనే మరో వృద్ధ దంపతులకు అండగా నిలిచేందుకు ముందుకొచ్చారు రాఘవ లారెన్స్. చెన్నైలో లోకల్ట్రైన్స్లో దాదాపు 80 ఏళ్ల వృద్ధుడు  స్వీట్స్ విక్రయించడం సోషల్ మీడియాలో వైరలైంది. వయసులో తన భార్య చేసిన స్వీట్లను విక్రయిస్తూ జీవనోపాధి పొందుతున్నారు. ఈ వార్త పలు మీడియా ఛానెల్స్లో న్యూస్ రావడంతో ఇది చూసిన రాఘవ లారెన్స్ చలించిపోయారు.

వెంటనే వారి వివరాలు కనుక్కుని రూ.లక్ష సాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు. ఎవరికైనా వారి వివరాలు తెలిస్తే తనకు తెలియజేయాలని ట్విటర్ వేదికగా కోరారు. వారి కోసం వివరాల కోసం ప్రయత్నిస్తున్నా సాధ్యం కావడం లేదన్నారు. మీరు వారిని రైలులో చూసినట్లు అయితే అతని స్వీట్లు కొని వీలైన విధంగా వారికి మద్దతు నిలవండి అని లారెన్స్ విజ్ఞప్తి చేశారు. కాగా.. లారెన్స్‌ ప్రస్తుతం బుల్లెట్టు బండి సినిమా చేస్తున్నాడు. ఆ తర్వాత కాంచన 4 స్టార్ట్‌ చేయనున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement