
జిగర్తాండ తర్వాత సినిమాలకు కాస్తా గ్యాప్ ఇచ్చిన కోలీవుడ్ స్టార్ రాఘవ లారెన్స్ హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం 'బుల్లెట్టు బండి'. ఈ సినిమాకు ఇన్నాసి పాండియన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఫైవ్ స్టార్ క్రియేషన్స్ బ్యానర్పై కతిరేసన్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో టాలీవుడ్ నటుడు సునీల్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ మూవీ నుంచి అభిమానులకు బిగ్ అప్‌డేట్ ఇచ్చారు మేకర్స్.
తాజాగా ఈ మూవీ టీజర్ను మేకర్స్ విడుదల చేశారు. టీజర్ చూస్తుంటే ఈ సినిమాను మిస్టరీ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. రాఘవ లారెన్స్ ఫైట్స్, యాక్షన్ సీక్వెన్స్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ చిత్రంలో టాలీవుడ్ నటుడు సునీల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రంలో ఎల్విన్,, వైశాలి, సింగంపులి కీలక పాత్రల్లో నటిస్తున్నారు.