గుండెపోటుతో డిగ్రీ విద్యార్థిని మృతి | Degree Student Died Due To Heart Attack In Karnataka, More Details Inside | Sakshi
Sakshi News home page

గుండెపోటుతో డిగ్రీ విద్యార్థిని మృతి

Jun 27 2025 7:19 AM | Updated on Jun 27 2025 9:13 AM

Degree Student Ends Life Heart Attack

గుండెపోటుతో 3వ తరగతి బాలుడు మృత్యువాత, తరగతిలో ఆరో తరగతి బాలిక హఠాన్మరణం.. ఇలాంటి బాధాకర ఘటనలు కొన్నేళ్లుగా అధికమయ్యాయి. నూరేళ్ల జీవితం కళ్లముందే ఆవిరైతే కన్నవారి ఆవేదన మిన్నంటుంతోంది. ఈ కడుపు కోతకు పరిష్కారమే లేదా అని ఘోషిస్తున్నారు. ఈ నేపథ్యంలో వైద్యనిపుణులు కొన్ని పరిశోధనలు చేసి మొబైల్‌ఫోన్‌తో పాటు మరికొన్ని లింకులు ఉన్నట్లు తేల్చారు.   

కర్ణాటక: హాసన్‌ జిల్లాకు చెందిన డిగ్రీ విద్యార్థిని గుండెపోటుతో అర్ధాంతరంగా కన్నుమూసింది. బెంగళూరులో నివాసం ఉంటున్న సుప్రియా (22) గుండెపోటు రావడంతో క్షణాల్లో ప్రాణాలు విడిచింది. దీంతో గత నెలరోజుల్లో  గుండెపోటుతో చనిపోయిన హాసన్‌వాసుల సంఖ్య 14కు పెరిగింది. సుప్రియా హాసన్‌ జిల్లా హొళెనరసీపుర తాలూకా కట్టళ్లి వాసి, బెంగళూరు బ్యాటరాయనపురలో నివాసం ఉంటూ కర్ణాటక ఓపెన్‌ వర్శిటీలో డిగ్రీ చదువుతోంది. బుధవారం ఇంటిలో ఉండగా హఠాత్తుగా కుప్పకూలింది. కుటుంబీకులు ఆస్పత్రి తరలిస్తుండగా దారిలో మరణించింది.      

Advertisement
 
Advertisement
Advertisement