
సాక్షి, హైదరాబాద్: నాచారం ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో 9వ తరగతి చదువుతున్న తోటి విద్యార్థిపై మరి కొంతమంది విద్యార్థులు దాడిచేసిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బర్త్‌డే వేడుకలో విద్యార్థిపై పిడిగుద్దులు కురిపించారు. విద్యార్థికి రక్తం కారుతున్నా వదలని క్లాస్‌మేట్స్.. దాడికి పాల్పడ్డారు. ఆగస్టు 29న 9వ తరగతికి చెందిన విద్యార్థి పుట్టినరోజున పాఠశాల వచ్చాడు. తరగతి గదిలో మరో ముగ్గురు స్నేహితులు 'బర్త్ డే బంప్స్' అనే ఆట ఆడారు. దీనిలో భాగంగా ప్రైవేట్ భాగాలను మోకాలితో బలంగా కొట్టారు.
కొంతమంది తనపై దాడి చేశారని సదరు విద్యార్థి వైస్ ప్రిన్సిపాల్, ప్రిన్సిపాల్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో కుటుంబస భ్యులు పలు ఆస్పత్రులలో చిక్సిత నిమిత్తం డాక్టర్‌ను సంప్రదించారు. పరీక్షించిన వైద్యులు మరో 3 నెలల పాటు విశ్రాంతి అవసరమని చెప్పారు. బాధిత విద్యార్థి తల్లిదండ్రులు దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.