
– మాజీ వింగ్ కమాండర్ సందీప్ సింగ్ జగ్గి
హైదరాబాద్ : విద్యార్థి దశ నుంచే క్రమశిక్షణతో కూడా నాయకత్వ లక్షణాలు కలిగి ఉండాలని మాజీ వింగ్ కమాండర్ సందీప్ సింగ్ జగ్గి అన్నారు. శుక్రవారం మాదాపూర్‌లోని మెరీడియన్ స్కూల్‌లో మోడల్ యునైటెడ్ నేషన్స్ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు వివిధ దేశాల ప్రతినిధులుగా వ్యవహరిస్తూ చర్చించేందుకు ఇలాంటి వేదిక ఏర్పాటు చేసుకోవడం అభినందనీయమని ఇలాంటి కార్యక్రమాల వల్ల ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల్లో ఏం జరుగుతుందో తెలుసుకునే అవకాశం ఉంటుందని ఆయన అన్నారు.

పాఠశాల ప్రిన్సిపాల్ కరణం భవాని మాట్లాడుతూ మూడు రోజుల పాటు నిర్వహించే ఈ మోడల్ యునైటెడ్ నేషన్స్ సెషన్స్‌లో నగరంలోని 40 పాఠశాలల నుంచి 500 మందికి పైగా విద్యార్థులు పాల్గొంటున్నారని తెలిపారు. వీరు వివిధ దేశాల రాయబారులుగా, ప్రతినిధులు ఆయా దేశాల్లోని నిధులు, నియామకాలు, సమస్యలు, పర్యావరణ సమస్యలు, సహజ వనరులపై చర్చిస్తారని తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులు తొలి రోజు తమ దేశాల ఎజెండాలను ప్రవేశ పెట్టి ఒక్కో అంశంపై చర్చించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.
