
ఆర్కిటెక్చర్, ఇంటీరియర్స్ ఉత్పత్తులకు సంబంధించిన పాపులర్ ప్రదర్శన డిజైన్ డెమోక్రసీ వచ్చేనెల 5న నగరంలోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్‌లో జరగనుంది. బంజారాహిల్స్‌లోని రాడిసన్ బ్లూ హోటల్‌లో జరిగిన ఓ సమావేశంలో ఈ విషయాన్ని ప్రకటించిన నిర్వాహకులు ఎక్స్‌పో వివరాలను వెల్లడించారు.
ఇందులో 120కి పైగా ప్రముఖ బ్రాండ్‌లు, 80పైగా పేరొందిన స్పీకర్లు పాల్గొంటారని, 15 వేలకుపైగా సందర్శకులు వస్తారని అంచనా వేస్తున్నామన్నారు. 3 రోజుల ప్రదర్శనలో చర్చలు, ఆవిష్కరణలు.. వంటివి ఉంటాయన్నారు.
ఫర్నిచర్, లైటింగ్, ఫ్లోరింగ్, గృహోపకరణాలు, వంటగది, బాత్, డెకర్ ఉపకరణాలు ఫైన్‌ఆర్ట్, క్రాఫ్ట్ వంటి వాటి ఎంపికలో నగర వినియోగదారుల అభిరుచులను కొత్తస్థాయికి ఇవి చేరుస్తాయన్నారు. సమావేశంలో సహ వ్యవస్థాపకులు శైలజా పట్వావరీ, మల్లికా శ్రీవాస్తవ్, క్యూరేటర్ అర్జున్ రతి పాల్గొని మాట్లాడారు.
విద్యార్థి ప్రతిభ..
ఎఫ్‌డీడీఐ–హైదరాబాద్ విద్యార్థులు చదువుతోపాటు తమ సృజనాత్మకతకు పదును పెడుతూ వినూత్న ఆలోచనలతో వివిధ వస్తువుల తయారీకి శ్రీకారం చుడుతున్నారు. తాజాగా ఎఫ్‌డీడీఐలోని ఎల్‌ఎల్‌పీడీకి చెందిన ద్వితీయ సంవత్సరం విద్యార్థి జీవా ప్రోటోటైప్ ఉత్పత్తిగా కుట్టులేని నాణెం పౌచ్‌కు రూపకల్పన చేశారు.
రావి(పీపాల్) ఆకు రూపం, ఆకృతి నుంచి ప్రేరణ పొంది ఆకుపచ్చ రంగులో కృత్రిమ తోలు, గుండు సూది, షూలేస్‌ను ఉపయోగించి కుట్లు లేకుండా ఈ పౌచ్‌ను తయారు చేశాడు. జీవాను ఎఫ్‌డీడీఐ –హైదరాబాద్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ తేజ్‌లోహిత్‌రెడ్డి, ఫ్యాకల్టీ ప్రతినిధులు వేణుగోపాల్, గోఫ్రాన్, రుచిసింగ్, హుస్సేన్, రాంబాబు అభినందించారు.
– రాయదుర్గం