
హైదరాబాద్ నగరంలో ప్రతీ ఏడాది అత్యంత వైభవంగా నిర్వహించే గణేష్ పండగ సందడి మొదలైంది. ఇందులో భాగంగా నగరవ్యాప్తంగా గణేష్ మండపాలను నిర్మిస్తున్నారు. మరోవైపు నిర్వాహకులు భారీ గణనాథులను ఆగమనం పేరుతో గ్రాండ్‌గా మండపాలకు తీసుకొస్తున్నారు. వినాయక నిమజ్జనానికి భారీ ఉత్సాహంతో బ్యాండ్ బాజాతో వెళ్లడం విధితమే.
అయితే ఈసారి నగరంలో మండపాలకు వినాయకులకు గ్రాండ్ వెల్‌కమ్ పలుకుతున్నారు. ఈ కొత్త సంస్కృతి నగరంలోని పలు ప్రాంతాల్లో కొనసాగుతోంది. ఇందులో భాగంగా మూసారాంబాగ్ జేజీవైఏ అసోసియేషన్ నిర్వాహకులు 22 ఫీట్ల భారీ గణేష్ విగ్రహాన్ని గ్రాండ్ సెలబ్రేషన్స్‌తో మండపానికి తరలించారు.
గణేశుడి రాక, గణేశోత్సవ వేడుకలలో మహారాష్ట్ర బ్యాండ్ ఆట పాటలు, కలర్‌ఫుల్ ఫైర్ క్రాకర్స్ కాలుస్తూ ఆగమన కార్యక్రమం నిర్వహించారు. గణేష్ నిమజ్జనం కాకుండా, ఆగమనం కార్యక్రమాలను భారీ సెటప్స్‌తో మండపాలకు తీసుకొస్తున్న ట్రెండ్ అందరినీ ఆకట్టుకుంది.
(చదవండి: Fake Wedding: పెళ్లి థీమ్..పార్టీ జూమ్..! ఇది పెళ్లిళ్లకు పేరడి..)