
న్యూఢిల్లీ: ఆరు రోజుల క్రితం ఢిల్లీలో అదృశ్యమైన త్రిపురకు చెందిన యువతి స్నేహా దేబ్‌నాథ్(19) ఆత్మహత్య చేసుకున్నదని, ఆమె మృతదేహం యుమునా నదిలో కనిపించిందని పోలీసులు తెలిపారు. ఈమె ఢిల్లీ యూనివర్శిటీలో చదువుకుంటోంది. స్నేహా దేబ్‌నాథ్ మృతదేహాన్ని ఆమె కుటుంబ సభ్యులు నిర్ధారించారని పోలీసులు పేర్కొన్నారు.
స్నేహా దేబ్‌నాథ్ అదృశ్యమైన దరిమిలా త్రిపురలోని ఆమె కుటుంబ సభ్యులు ఆమె కోసం తీవ్రంగా గాలించారు. జూలై 7న ఆమె ఉత్తర ఢిల్లీలోని సిగ్నేచర్ బ్రిడ్జికి క్యాబ్‌లో వెళ్లింది. స్నేహ తాను ఆత్మహత్య చేసుకోవాలని అనుకుంటున్నట్లు సూచించే నోట్‌ను స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. చదువు విషయంలో ఆమె కలకతచెందడం లేదని, ఆమె ఆందోళనకు కారణం కుటుంబ కలహాలై ఉండవచ్చని పోలీసు వర్గాలు తెలిపాయి. సిగ్నేచర్ బ్రిడ్జికి 10 కి.మీ దిగువన ఉన్న గీతా కాలనీలోని ఫ్లైఓవర్ సమీపంలోని యమునా నదిలో ఆమె మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు.
స్నేహా దేబ్‌నాథ్‌ను ఈ స్థలంలో దింపినట్లు క్యాబ్ డ్రైవర్ పోలీసులకు తెలిపాడు. కాగా ఈ వంతెనపై నిలబడి ఉన్న ఒక అమ్మాయిని చూశామని కొందరు ప్రత్యక్ష సాక్షులు తెలిపారని పోలీసులు పేర్కొన్నారు. జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (ఎన్‌డీఆర్‌ఎఫ్), పోలీసు విభాగాల సహాయంతో ఆమె కోసం గాలింపు చర్యలు సాగాయి. వారు ఉత్తర ఢిల్లీలోని నిగమ్ బోధ్ ఘాట్ నుండి ఉత్తరప్రదేశ్‌లోని నోయిడా వరకుగల అన్ని ప్రాంతాలను అణువణువునా జల్లెడ పట్టారు. జూలై 7 తెల్లవారుజామున స్నేహా తన సన్నిహితులకు ఈమెయిల్స్ పంపిందని పోలీసులు తెలిపారు. గత కొన్ని నెలలుగా ఆమె మానసికంగా బాధపడుతున్నట్లు స్నేహితులు పోలీసులకు తెలిపారు.