
సాక్షి,జగిత్యాల జిల్లా: ఆన్‌లైన్‌గేమ్స్‌కు అలవాటు పడి తొమ్మిదవ తరగతి విద్యార్ధి ఆత్మహత్య చేసుకున్నాడు. పట్టణంలోని లింగంపేటకు చెందిన విష్ణువర్ధన్ (15) ఆన్‌లైన్ గేమ్స్‌కు అలవాటు పడి తరచూ మొబైల్‌లో మునిగిపోతున్నాడు.
ఈ క్రమంలో ఆన్‌లైన్ గేమ్స్‌ను పక్కన పెట్టి చదువుపై దృష్టిసారించాలని విష్ణువర్ధన్‌ను అతని తల్లి మందలించింది. దీంతో తల్లిపై తిరగబడి,దాడి చేశాడు. అనంతరం ఇంట్లో ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దుర్ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.