మద్యం షాపునకు అనుమతి ఇవ్వొద్దని ధర్నా
కోరుట్లరూరల్: మండలంలోని అయిలాపూర్‌లో గతంలో ఎస్సీ కాలనీలో ఉన్న మద్యం షాపును కోరుట్ల–అయిలాపూర్ రోడ్డుకు మార్చడాన్ని నిరసిస్తూ వార్డు మహిళలు గురువారం ధర్నాకు దిగారు. ఊరు చివరన ఉన్న మద్యం షాపును కోరుట్ల–అయిలాపూర్ రోడ్డుకు మార్చేందుకు షెడ్డు నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. షాపును మార్చడానికి ఎందుకు అనుమతి ఇచ్చారంటూ పంచాయతీ కార్యదర్శిని నిలదీశారు. విషయాన్ని ఎకై ్సజ్ అధికారుల దృష్టికి తీసుకెళ్తానని కార్యదర్శి తెలిపారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మహిళల్ని సముదాయించారు.


