జగిత్యాల: పదో తరగతి పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు డీఈవో రాము తెలిపారు. గతేడాది టెన్త్ ఫలితాల్లో నాలుగో స్థానంలో నిలిచామని, ఈసారి మొదటిస్థానం సాధించేలా కలెక్టర్ సత్యప్రసాద్ ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారని తెలిపారు. ఇప్పటికే జయీభవ విజయీభవ 2.0 లేఖ ద్వారా కలెక్టర్ సందేశాలు పంపించారని, 10న విద్యార్థులతో జూమ్ ద్వారా ముఖాముఖి మాట్లాడారని పేర్కొన్నారు. ప్రణాళిక, ఆరోగ్యం, పూర్వ ప్రశ్నపత్రాల సాధన, ఒత్తిడికి దూరంగా, రాత నైపుణ్యం ఎలానో వివరించారని తెలిపారు. విద్యార్థులు కేంద్రానికి అరగంట ముందే చేరుకుంటే ప్రశాంతంగా పరీక్ష రాయవచ్చన్నారు. వేసవికాలం కావడంతో అన్ని వసతులు కల్పించామని వివరించారు. ఈనెల 14 నుంచి ప్రారంభంకానున్న టెన్త్ పరీక్షల నేపథ్యంలో ఆయన ‘సాక్షి’తో పలు విషయాలు వెల్లడించారు.


