జనగణన పారదర్శకంగా చేపట్టాలి | - | Sakshi
Sakshi News home page

జనగణన పారదర్శకంగా చేపట్టాలి

Mar 12 2026 7:38 AM | Updated on Mar 12 2026 7:38 AM

● అదనపు కలెక్టర్‌ లత

జగిత్యాల: జనగణన ప్రక్రియ పారదర్శకంగా చేపట్టాలని అదనపు కలెక్టర్‌ లత అన్నారు. బుధవారం జనగణన తొలిదశ హౌస్‌ లిస్టింగ్‌, హౌసింగ్‌ శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. శిక్షణలో డేటా సేకరణ విధానం, డిజిటల్‌ పరికరాల వినియోగం, ఫీల్డ్‌ స్థాయిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారు. భవిష్యత్‌లో ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు ప్రణాళికకు కచ్చితమైన గణాంకాలు సిద్ధమవుతాయన్నారు.

ఎస్సెస్సీ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు

పదో తరగతి పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని బీఎస్‌.లత అన్నారు. బుధవారం విద్యాశాఖ అధికారులతో సమావేశమయ్యారు. విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాసేలా చర్యలు తీసుకోవాలని, కేంద్రాల్లో వసతులు కల్పించాలని సూచించారు. డీఈవో రాము, జిల్లా పరీక్షల విభాగం అధికారి నరేందర్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement