‘ప్రగతి ప్రణాళిక’ విజయవంతం చేద్దాం | - | Sakshi
Sakshi News home page

‘ప్రగతి ప్రణాళిక’ విజయవంతం చేద్దాం

Mar 12 2026 7:38 AM | Updated on Mar 12 2026 7:38 AM

● తండాలకు రవాణా సౌకర్యం కల్పిస్తాం ● పుష్కరాలకు ప్రత్యేక నిధులు ● మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌

జగిత్యాల: ప్రజాపాలన, ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణను అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో విజయవంతం చేయాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌ అన్నారు. జిల్లా కేంద్రంలోని సుమంగళి గార్డెన్‌లో మున్సిపల్‌ చైర్మన్లు, వార్డు కౌన్సిలర్లు, సర్పంచులకు శిక్షణ కల్పించారు. 10 అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పెండింగ్‌ ఫైళ్లు క్లియర్‌ చేయాలని, కలెక్టర్‌ ప్రతిరోజూ సమీక్ష నిర్వహించాలని సూచించారు. పరిశుభ్రత, పారిశుధ్య నిర్వహణ, వీధిదీపాలు, తాగునీటి అంశాలపై ప్రతినిధులు భాగస్వామ్యం కావాలన్నారు.

పుష్కరాలకు ప్రత్యేక నిధులు

గోదావరి పుష్కరాలకు నిధుల కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలిపారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా అన్ని పనులు పూర్తయ్యేలా పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. సాగునీటి సమస్య పరిష్కారానికి మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డితో కలిసి నిధులు తేవడానికి కృషి చేస్తానన్నారు. అన్ని గిరిజన గ్రామాలు, తండాలకు మెరుగైన రవాణా సౌకర్యం కల్పిస్తామన్నారు. చల్‌గల్‌లో ఉన్న ప్రభుత్వ భూములను కేంద్రీయ విద్యాలయం లేదా ఇంటిగ్రేటెడ్‌ స్కూల్‌ నిర్మాణం కోసం కేటాయిస్తామన్నారు.

అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలి

కొత్తగా ఎన్నికై న చైర్‌పర్సన్లు, కౌన్సిలర్లు, సర్పంచులు సామాజిక బాధ్యతతో పనిచేసి అభివృద్ధిలో అందరు భాగస్వాములు కావాలని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌ అన్నారు. మున్సిపల్‌ పరిధిలో అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలన్నారు.

హక్కులు, బాధ్యతలు తెలుసుకోవాలి

కొత్తగా ఎన్నికై న ప్రతినిధులు వారి హక్కులు తెలుసుకుని అభివృద్ధి చేయాలని, ప్రజాపాలన ప్రగతి కార్యక్రమంలో సమన్వయంతో పనిచేయాలని కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్‌ అన్నారు.

ప్రణాళికబద్ధంగా చర్యలు

ప్రజాపాలన ప్రగతి కార్యక్రమాన్ని విజయవంతం కోసం ప్రణాళికబద్ధంగా ముందుకెళ్తామని కలెక్టర్‌ సత్యప్రసాద్‌ అన్నారు. నిత్యం శాఖల వారీగా సమీ క్షిస్తున్నామని తెలిపారు. ప్రజాప్రతినిధులు, అధికా రులు సమన్వయంతో ముందుకెళ్లాలన్నారు. ప్లాస్టిక్‌ వాడకాన్ని తగ్గిద్దాం, పర్యావరణాన్ని కాపాడుదాం వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరించారు. మున్సిపాలిటీల చైర్మన్లు సమిండ్ల వాణి, వేముల నాగలక్ష్మి, లింబాద్రి, వసంత పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement