కరీంనగర్: బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా కరీంనగర్ నగర డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్‌రావును నియమిస్తూ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు ఆదేశాలు జారీచేశారు. తనపై నమ్మకం ఉంచి బాధ్యతను అప్పగించి న రామచందర్‌రావు, కేంద్ర హోంశాఖ సహా య మంత్రి బండి సంజయ్‌కుమార్‌కు సునీ ల్‌రావు కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ అభ్యున్నతికి కృషి చేస్తానని తెలిపారు. మోదీ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తానన్నారు.
బాలికలు హెచ్‌పీవీ వ్యాక్సిన్ వేసుకోవాలి
ధర్మపురి: గర్భాశయ క్యాన్సర్ నివారణకు హెచ్‌పీవీ వ్యాక్సిన్‌ను బాలికలు వేసుకోవాలని డిప్యూటీ డీఎంఅండ్ హెచ్‌వో శ్రీనివాస్ అన్నా రు. 14ఏళ్లు దాటిన బాలికలకు పట్టణంలోని ఆస్పత్రిలో బుధవారం హ్యూమన్ పాపిల్లోమా వైరస్ (హెచ్‌పీవీ) వ్యాక్సిన్‌ను అందించారు. వైద్యులు, సిబ్బంది తదితరులున్నారు.
‘ఆత్మ’ చైర్మన్‌గా కాటిపెల్లి గంగారెడ్డి
రాయికల్: అగ్రికల్చర్ టెక్నాలజీ మేనేజ్‌మెంట్ ఏజెన్సీ (ఆత్మ) చైర్మన్‌గా రాయికల్ మండలం ఇటిక్యాల గ్రామానికి చెందిన కాటిపెల్లి గంగారెడ్డి నియామకమయ్యారు. గంగారెడ్డి ఎమ్మెల్యే సంజ య్ కుమార్‌ను బుధవారం మర్యాదపూర్వకంగా కలవగా ఆయన శుభాకాంక్షలు తెలిపారు. సర్పంచ్ నీరటి శ్రీనివాస్, ఉప సర్పంచ్ నాగిరెడ్డి సాయిరెడ్డి, మాజీ సర్పంచులు శ్రీని వాస్, సామాల్ల వేణు, రవీందర్‌రావు, శ్రీని వాస్, శేఖర్‌రెడ్డి, నారాయణరెడ్డి పాల్గొన్నారు.
ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిన స్పీకర్
కథలాపూర్: పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి విషయంలో స్పీకర్ నిర్ణయం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసినట్లుందని బీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి లోక బాపురెడ్డి అన్నారు. కథలాపూర్‌లో బుధవారం విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాజ్యాంగ స్ఫూర్తిని తుంగలో తొక్కి పాలిస్తోందన్నారు. కాంగ్రెస్‌లో చేరినట్లు ఆధారాలున్నా.. స్పీకర్ చర్యలు తీసుకోకపోవడం దారుణమన్నారు. కాంగ్రెస్ అన్యాయాలను ప్రజలు గమనిస్తున్నారని, గుణపాఠం చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు.
మక్కల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయండి
మెట్‌పల్లి: ప్రభుత్వం మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని భారతీయ కిసాన్ సంఘ్ ఆధ్వర్యంలో రైతులు బుధవారం ఆర్డీఓ కార్యాలయం అధికారులకు వినతిపత్రం అందించారు. మక్కలకు బహిరంగ మార్కెట్‌లో వ్యాపారులు తక్కువ ధర చెల్లిస్తున్నారని, తద్వారా రైతులకు నష్టం జరుగుతోందని, ప్రభుత్వం స్పందించి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో మారు మురళీధర్‌రెడ్డి, క్యాతం సంజీవ్‌రెడ్డి, అల్లూరి అక్కిరెడ్డి, సార్ల రవి తదితరులున్నారు.


