కంట్రోల్‌రూం వినియోగించుకోవాలి
జగిత్యాల: గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్, మీడియా సర్టిఫికేషన్ మానిటరింగ్ కమిటీ సహాయ కేంద్రం కంట్రోల్ రూంను వినియోగించుకోవాలని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో ఏవైనా సమస్యలుంటే 96662 34383 నంబర్‌లో సంప్రదించాలని కోరారు.
మూడో ర్యాండమైజేషన్ పూర్తి
మూడో ర్యాండమైజేషన్ ప్రక్రియ పూర్తయినట్లు కలెక్టర్ తెలిపారు. కలెక్టరేట్‌లో జనరల్ అబ్జర్వర్ రమేశ్‌తో కలిసి ర్యాండమైజేషన్ చేశారు. ఎన్నికల్లో ఎలాంటి లోపాలు లేకుండా సమర్థవంతంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. అడిషనల్ కలెక్టర్ రాజాగౌడ్, నోడల్ అధికారి మధుసూదన్ పాల్గొన్నారు.
కలెక్టర్ సత్యప్రసాద్


