ఆ ఎన్నిక రద్దు చేయండి..
జగిత్యాలటౌన్: ఏకగ్రీవం చేసిన సర్పంచ్ స్థానాన్ని రద్దు చేయాలని కోరుతూ యామాపూర్ గ్రామస్తులు గురువారం కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేపట్టారు. యామాపూర్ సర్పంచ్ స్థానానికి రెండు నామినేషన్లు దాఖలుకాగా.. ఏకగ్రీవం చేయాలని భావించిన గ్రామ పెద్దలు ఒకరిని బరి నుంచి తప్పించారని ఆరోపించారు. నిరసనలో నామినేషన్ ఉపసంహరించుకున్న ఎల్లాల గోపాల్‌రెడ్డి కూడా పాల్గొన్నారు. వీడీసీ సభ్యులు తనను బెదిరించి రూ.4లక్షలు ఇచ్చిన వ్యక్తిని ఏకగ్రీవం చేశారని, దానిని రద్దు చేసి ప్రజాస్వామ్యబద్ధంగా తిరిగి ఎన్నిక నిర్వహించాలని కోరారు. పోలీసులు చేరుకుని గ్రామస్తులకు నచ్చజెప్పి ఆందోళన విరమింపచేశారు.


