లిటిల్‌ పొయెట్‌..! | 4th Class Student of Vibgyor High Btm became the Youngest Poet | Sakshi
Sakshi News home page

లిటిల్‌ పొయెట్‌..!

Sep 13 2025 9:27 AM | Updated on Sep 13 2025 9:27 AM

4th Class Student of Vibgyor High Btm became the Youngest Poet

కేరళ రాష్ట్రం కోళికోడ్‌కు చెందిన అజ్ఞా యామి దేశంలో అతి పిన్న వయస్కురాలైన కవయిత్రిగా రికార్డు సృష్టించింది. ఐదేళ్లకే కవిత్వం రాసి పుస్తకం వేసింది. రైమ్స్‌ చెప్పే వయసులో సొంతంగా కవిత్వం రాయడం చాలా గ్రేట్‌.

అజ్ఞా యామి  2017లో జన్మించింది. యూకేజీ చదువుతున్న సమయంలోనే మలయాళ పదాలతో వాక్యాలు రాస్తూ తన భావాలను వ్యక్తం చేసేది. ఆమె ప్రతిభ, భాష పట్ల మక్కువ చూసిన తల్లిదండ్రులు, శ్రీశాంత్, శ్రుతి  ప్రోత్సహించారు. కవిత్వం గురించి, కవితల గురించి వివరించారు. కొన్ని కవితలు విన్న అజ్ఞా యామి తనూ కవిత్వం రాయడం మొదలెట్టింది. 

చుట్టూ ఉన్న ప్రపంచంలోని రకరకాల అంశాలపై కవితలు అల్లింది. బాల్యంలోని అమాయకత్వం మొదలుకొని, ప్రకృతిలోని రంగుల వరకు అనేక రకాల సబ్జెక్ట్స్‌ పై పోయెమ్స్‌ రాసింది.  30 కవితల్ని కలిపి ‘వర్ణపట్టం’(రంగుల గాలిపటం) పేరుతో పుస్తకం వెలువరించింది. వాటికి బొమ్మలు కూడా తనే గీయడం విశేషం. వరల్డ్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ ప్రతినిధులు అతి పిన్న వయస్కురాలైన కవయిత్రిగా రికార్డు అందించారు. 

(చదవండి: చెట్లు ఒకదానితో ఒకటి మాట్లాడుకోగలవు)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement