
జగిత్యాల జిల్లా : జిల్లాలోని మేడిపల్లి మండలం దమ్మనపేట్‌లో విషాదచాయలు అలుముకున్నాయి. దమ్మనపేట్‌కు చెందిన ఎనుగు మహేందర్ రెడ్డి (26) అనే అనే విద్యార్థి లండన్‌లో దుర్మరణం చెందాడు. ఉన్నత విద్యను అభ్యసించడానికి లండన్‌కు వెళ్లిన మహేందర్‌రెడ్డికి గుండెపోటు రావడంతో మృత్యువాత పడినట్లు తల్లిదండ్రులకు సమాచారం అందించారు.
నిన్న(శుక్రవారం, అక్టోబర్ 3వ తేదీ) రాత్రి మహేందర్‌రెడ్డి చనిపోయిన విషయాన్ని అతని స్నేహితులు తండ్రి రమేష్‌రెడ్డికి తెలియజేశారు. ఉన్నత చదువుల కోసం రెండేళ్ల క్రితం లండన్‌కు వెళ్లాడు మహేందర్‌రెడ్డి. కుమారడు ప్రయోజకుడు అవ్వడానికి లండన్ వెళ్లి ఇలా మృతి చెందడం కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. కొడుకు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడంతో తండ్రి శోకసంద్రంలో మునిగిపోయారు.