హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోదీపై కమ్యూనిస్టు పార్టీ ఎమ్మెల్యే కూనంనేని చేసిన వ్యాఖ్యలను అభ్యంతరకరంగా ఉన్నాయని బీజేపీ ఎంపీ, కేంద్ర మంత్రి బండి సంజయ్ ధ్వజమెత్తారు. ప్రధాని నరేంద్ర మోదీపై చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నానని ఎక్స్ వేదికగా బండి సంజయ్ మండిపడ్డారు.
‘దేశవ్యాప్తంగా కమ్యూనిస్టు భావజాలం ప్రజాదరణను కోల్పోయింది. ఇందుకు ఇలాంటి బాధ్యతలేని, అసభ్య భాషే ప్రధాన కారణం. తెలంగాణ అసెంబ్లీలో అలాంటి వ్యాఖ్యలను అనుమతించడమే కాకుండా ఆ మాటలను ఆస్వాదిస్తూ స్పీకర్ నవ్వడం బాధాకరం. ప్రజాస్వామ్య విలువలను కాపాడాల్సిన బాధ్యతను కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరించింది.
మిత్రపక్షాన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తోంది. ప్రధాని మోదీ నాయకత్వంలో భారత్ అన్ని రంగాల్లో గణనీయమైన పురోగతి సాధించింది. కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలు మాత్రం రాజకీయ దూషణలకే పరిమితమై ప్రజల విశ్వాసాన్ని కోల్పోయాయి. తక్షణమే ఈ వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలి. దేశ ప్రజలకూ, గౌరవ ప్రధానికీ నిస్సందేహంగా క్షమాపణ చెప్పాల్సిందే’ అని బండి సంజయ్ డిమాండ్ చేశారు.
Strongly condemn the offensive remarks made by a Communist Party MLA against Hon’ble Prime Minister Shri @narendramodi Ji.
Communism has lost ground across the country, and this kind of reckless language explains why.
Such language has no place in a democratic Assembly. By…— Bandi Sanjay Kumar (@bandisanjay_bjp) January 2, 2026


