సాక్షి, నెల్లూరు: ఏసీఎస్‌ఆర్(ACSR) ప్రభుత్వ మెడికల్ కాలేజీలో మెడిసిన్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. ఫస్ట్ ఇయర్ విద్యార్థిని గీతాంజలి హాస్టల్ రూమ్‌లో ఫ్యాన్‌కి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. విద్యార్థిని.. నంద్యాల నుంచి నిన్నే(గురువారం) హాస్టల్‌కి వచ్చింది. హాస్టల్‌లోకి మీడియాను యాజమాన్యం అనుమతించలేదు. పోలీసులు విచారణ చేపట్టారు.
విద్యార్థిని ఆత్మహత్యపై సీఐ రోశయ్య మాట్లాడుతూ.. గీతాంజలీ హాస్టల్ 3వ అంతస్తులోని రూమ్‌లో ఉంటుందని.. దసరా సెలవులకు తన స్వగ్రామం వెళ్లి నిన్న రాత్రి తిరిగి వచ్చిందని.. నేటి నుంచి అనాటమీ ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ఉన్నాయన్నారు. ఉదయం స్నేహితురాలతో కలిసి టిఫిన్ చేసి రూమ్‌కి వెళ్ళిందని.. రూమ్ డోర్ లాక్ చేసుకొని ఆత్మహత్య చేసుకుందని సీఐ తెలిపారు. ఆత్మహత్యకు సంబంధించిన కారణాలపై విచారణ చేపట్టామన్నారు. స్నేహితురాలు, తల్లిదండ్రులను విచారణ చేపట్టిన తరువాత పూర్తి వివరాలు బయటకు వస్తాయని సీఐ పేర్కొన్నారు.


