
విద్యార్థిని ఉరి వేసుకుని ఆత్మహత్య
అన్నానగర్(చెన్నై): కడలూరు జిల్లా విరుదాచలం సమీపంలోని ఎరుమనూర్ గ్రామానికి చెందిన దర్శిని (18). ఈమె విరుదాచలం ప్రభుత్వ కొలంజియప్పర్ ఆర్ట్స్ కళాశాలలో మొదటి సంవత్సరం బి.ఎ. చదువుతోంది. విరుదాచలం జంక్షన్ రోడ్ బస్టాండ్ సమీపం సెల్‌ఫోన్ సేల్స్ షాపులో పనిచేస్తోంది.
విద్యార్థిని దర్శిని కొంతకాలంగా ఓ యువకుడిని ప్రేమించినట్లు తెలుస్తోంది. ఈ స్థితిలో సోమవారం ఉదయం సెల్‌ఫోన్ షాపులో పనిచేస్తుండగా, తన ప్రియుడితో సెల్‌ఫోన్ ద్వారా వీడియో కాల్‌లో మాట్లాడుతోంది. ఆ సమయంలో వారిద్దరి మధ్య సమస్య కారణంగా, వీడియో కాల్‌లో మాట్లాడుతున్న దర్శిని దుకాణం వెనక్కి వెళ్లి అక్కడి గదిలో తలపాగాతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.