50 వేలు సుపారీ ఇచ్చి ప్రియుడితో కలిసి.. | Bheemili Ramya Case | Sakshi
Sakshi News home page

50 వేలు సుపారీ ఇచ్చి ప్రియుడితో కలిసి..

Jan 8 2026 6:46 AM | Updated on Jan 8 2026 11:34 AM

Bheemili Ramya Case

విశాఖపట్నం: ప్రియుడి మోజులో పడి, సుపారీ ఇచ్చి మరీ భర్తను అంతమొందించింది ఓ ఇల్లాలు. విశాఖపట్నం జిల్లాలోని మధురవాడలో జరిగిన ఈ ఘటన వివరాలు పీఎంపాలెం పోలీసులు బుధవారం తెలిపారు. బక్కనపాలెం ఎనీ్టఆర్‌ కాలనీకి చెందిన అల్లాడ నాగరాజు(38), రమ్య దంపతులు. వీరికి ఇద్దరు పిల్లలున్నారు. కంచరపాలేనికి చెందిన సంజీవి వసంతరావుతో రమ్య వివాహేతర సంబంధం పెట్టుకుంది. 

తమకు అడ్డు వస్తున్నాడనే నెపంతో ఎలాగైనా భర్త అడ్డు తొలగించుకోవాలని ప్రియుడితో కలిసి హత్యకు పథకం రచించింది. నాగరాజును చంపేందుకు వీరిద్దరూ కంచరపాలేనికి చెందిన బాలకృష్ణ, ప్రవీణ్‌కు రూ.50 వేలు ఇచ్చారు. నిందితులు వసంతరావు, బాలకృష్ణ, ప్రవీణ్‌ పథకం ప్రకారం నవంబరు 29న మధురవాడ మిథిలాపురి వుడా కాలనీలో గల ఓ లాడ్జిలో నాగరాజును హత్య చేసి శవాన్ని తిమ్మాపురం వెళ్లే రోడ్డులో ఉన్న బావికొండ సమీప నిర్మానుష్య ప్రాంతంలో పడేశారు. అనంతరం ఏమీ తెలియనట్లు రమ్య తన భర్త కనిపించడం లేదంటూ డిసెంబర్‌ 17న పీఎంపాలెం పోలీసులకు ఫిర్యాదు ఇచి్చంది. 

మిస్సింగ్‌ కేసు నమోదు చేయాలని, తన భర్త మద్యానికి బానిసయ్యాడని, రూ.5 వేలు నగదు, బంగారం పట్టుకుని వారం రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయాడని ఫిర్యాదులో పేర్కొంది. అనుమానం వచి్చన పోలీసులు రమ్యను తమదైన శైలిలో విచారించగా, హత్య ఉదంతం బయటపడింది. పథకం ప్రకారం తామే హత్య చేసినట్లు ఒప్పుకుంది. దీంతో పోలీసులు బుధవారం మృతదేహం పడేసిన ప్రాంతానికి వెళ్లి పరిశీలించారు. బాగా పాడైపోయిన మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కి తరలించారు. కేసు నమోదు చేసి, నిందితులు నలుగురినీ అరెస్టు చేసినట్లు పీఎంపాలెం సీఐ బాలకృష్ణ చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement