కర్ణాటక: ఓ మహిళ ఆమె కూతురితో పెళ్లికి ఒప్పుకోలేదని ప్రేమోన్మాది పెట్రోలు చల్లి నిప్పంటించడంతో మహిళ తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చివరికి కన్నుమూసింది. బాధితురాలు గీత (42) విక్టోరియా ఆసుపత్రిలో గత 20 రోజులుగా చావుబతుకుల మధ్య పోరాడుతూ మంగళవారం రాత్రి చనిపోయింది.
వివరాలు.. గీతా బసవేశ్వరనగర బోవికాలనీలో కిరాణా షాపును నడుపుతోంది. అక్కడే ప్రేమోన్మాది ముత్తు టీస్టాల్ పెట్టుకున్నాడు. ఈ నేపథ్యంతో గీత కుమార్తె (19)ను ముత్తు ప్రేమించాడు. ఆమెతో తనకు వివాహం చేయాలని గీతను కోరేవాడు, ఇందుకు ఆమె నిరాకరించేది. కోపోద్రిక్తుడైన అతడు.. గీత ఇంట్లో ఉండగా పెట్రోలు చల్లి నిప్పు అంటించి ఉడాయించాడు. తీవ్రంగా గాయపడిన గీత ఆస్పత్రిలో మరణించింది. స్థానిక పోలీసులు దుండగున్ని అరెస్ట్ చేశారు.


