ఘనంగా జాతీయ సైన్స్ దినోత్సవం
రాయచూరు రూరల్: నేటి ఆధునిక యుగంలో విద్యార్థులు సైన్స్‌పై (విజ్ఞానం) ఆసక్తి పెంచుకోవాలని కన్నడ సాహిత్య పరిషత్ కార్యదర్శి దండెప్ప బిరదార్ పేర్కొన్నారు. శనివారం రాయచూరు తాలుకా ఉడుంగల్ ఖనాపూర్ ప్రభుత్వ పాఠశాలలో జాతీయ సైన్స్ దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భౌతిక శాస్త్రవేత్త సర్ సి.వి.రామన్ రామన్ ఎఫెక్ట్‌ను కనుగొన్నందుకు గౌరవ సూచకంగా భారతదేశంలో ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 28న జాతీయ సైన్స్ దినోత్సవాన్ని జరుపుకుంటారని పేర్కొన్నారు. విద్యార్థులు పాఠ్యాంశాలకు తోడు పాఠ్యేతర విషయాలను మననం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో వీరేష్, శివలీల, వీణ, సరస్వతి, సావిత్రి, నపీజా అంజుమ్ తదితరులు పాల్గొన్నారు.
హోలీ ప్రశాంతంగా జరుపుకోండి
రాయచూరు రూరల్: నగరంలో ఈనెల 3వ తేదీన హోలి పండుగను ప్రశాంతంగా జరుపుకోవాలని అదనపు ఎస్పీ శివ కుమార, సదర్ బజార్ సీఐ ఉమేష్ కాంబ్లే సూచించారు. ఆదివారం సదర్ బజార్ పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన శాంతి సమావేశంలో వారు మాట్లాడారు. ఇంటర్ పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులను ఇబ్బంది పెట్టొద్దని తెలిపారు. ముస్లింలు రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలు పాటిస్తున్నారన్నారు. హిందువులు ఎలాంటి ఘర్షణలకు తావు ఇవ్వకుండా హోలి పండుగ ఆచరించాలని పేర్కొన్నారు.
ఆర్‌డీఏ అధ్యక్షుడిగా రామస్వామి
రాయచూరు రూరల్: ఆర్‌డీఏ అధ్యక్షుడిగా రాజశేఖర్ రామస్వామిని నియమిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్దరామయ్య శనివారం ఆదేశాలు జారీ చేశారు. గ్రామీణాభివృద్ధి, పంచాయితీ రాజ్ శాఖ మంత్రి ప్రియాంఖ ఖర్గే సిఫార్సుల మేరకు రామస్వామిని రాయచూరు నగరాభివృద్ధి ప్రాధికార (ఆర్‌డీఏ) అధ్యక్షుడిగా నియమించారు. రామస్వామి 30 ఏళ్లు పార్టీకి సేవలందించారు. నగర సభ, జిల్లా, తాలుకా పంచాయితీ ఎన్నికల్లో అభ్యర్థుల విజయానికి కృషి చేశారు. ఇదిలా ఉండగా రామస్వామికి రాయచూరు నగరాభివృద్ధి ప్రాధికార అధ్యక్ష పదవి లభించడంతో కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
బాధిత కుటుంబాలకు పరామర్శ
హొసపేటె: విజయనగర జిల్లా కూడ్లిగి తాలూకా గండబొమ్మనహళ్లిలో స్నానం చేసేందుకు చెరువులోకి దిగిన సరోజ, సుజాత నీట మునిగి మృతి చెందిన విషయం తెలిసిందే. ఆదివారం మాజీ మంత్రి బి.శ్రీరాములు మృతుల ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ధైర్యంగా ఉండాలని ఓదార్చారు. సరస్సు నీరు తాగి తీవ్ర అస్వస్థతకు గురై బళ్లారిలోని విమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శ్రావణి, భూమిక, అనిత, సంగీత త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థించారు. వారికి ఉత్తమ చికిత్స అందించాలని వైద్యులను కోరడం జరిగిందని తెలిపారు. చెరువు, నదులు ప్రదేశాలకు వెళ్లేటప్పుడు ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
హెల్మెట్ తప్పనిసరి
రాయచూరు రూరల్: నగరంలో ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలని ఎస్పీ అరుణాంగ్శు గిరి ఆదేశించారు. ఆదివారం మహాత్మా గాందీ క్రీడా మైదానంలో జిల్లా పోలీస్, ఎస్‌బీఐ, మద్యపాన ముక్త, పిట్నెస్, సైబర్ క్రైమ్ ఇతర నేరాలపై అవగాహన కల్పించేందుకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. నేరాల నియంత్రణకు అందరు సహకరించాలని కోరారు. రోడ్డు నిబంధనలు పాటిస్తే ప్రమాదాలు జరగవని పేర్కొన్నారు. రోడ్డు భద్రత నియమాలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. వాహనదారులు ప్రయాణించేటప్పడు వాహనానికి సంబంధించిన రికార్డులు, డ్రైవింగ్ లైసెన్స్, ఇన్సూరెన్స్ వెంట తెచ్చుకోవాలన్నారు. మహాత్మా గాంధీ క్రీడా మైదానం నుంచి జిల్లా పోలీస్ కార్యాలయం వరకు ర్యాలీ కొనసాగింది. కార్యక్రమంలో అదనపు ఎస్పీ హరీష్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
ఘనంగా జాతీయ సైన్స్ దినోత్సవం
ఘనంగా జాతీయ సైన్స్ దినోత్సవం
ఘనంగా జాతీయ సైన్స్ దినోత్సవం
ఘనంగా జాతీయ సైన్స్ దినోత్సవం


