సంస్కృతి, వారసత్వాల రక్షణ అందరి కర్తవ్యం | - | Sakshi
Sakshi News home page

సంస్కృతి, వారసత్వాల రక్షణ అందరి కర్తవ్యం

Mar 2 2026 8:20 AM | Updated on Mar 2 2026 8:20 AM

సంస్క

సంస్కృతి, వారసత్వాల రక్షణ అందరి కర్తవ్యం

ముగ్గుల పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేస్తున్న ఎమ్మెల్యే గాలి జనార్దనరెడ్డి, నృత్యం చేస్తున్న హిందూ సంఘాల కార్యకర్తలు

సాక్షి, బళ్లారి: మన సంస్కృతి వారసత్వాలను కాపాడుకోవాల్సి అవసరం ఉందని పలువురు వక్తలు పేర్కొన్నారు. ఆదివారం నగరంలోని ఎస్‌ఎన్‌ పేటలోని ఎంఎంటీసీ కాలనీలో విశాల హిందూ సమ్మేళన ఆధ్వర్యంలో శోభాయాత్ర నిర్వహించారు. మాజీ మంత్రి, గంగావతి ఎమ్మెల్యే గాలి జనార్దనరెడ్డి, మాజీ ఎమ్మెల్యే గాలి సోమశేఖరరెడ్డి తదితరులతో పాటు పలువురు స్వామిజీలు, కార్పొరేటర్లు పాల్గొని మాట్లాడారు. సత్యనారాయణ పేట వేంకటేశ్వర దేవాలయం నుంచి ఏర్పాటు చేసిన విశేష శోభాయాత్ర నగరవాసులను ఎంతగానో ఆకట్టుకుంది. వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, నృత్యాలు, మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. ముగ్గుల పోటీల్లో గెలుపొందిన వారికి నిర్వహకులు బహుమతులు అందజేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో వక్తలు మాట్లాడుతూ.. హిందూ సంస్కృతి రక్షణకు అందరూ నడుం బిగించాలని సూచించారు. మన సంస్కృతిపై దాడి చేసే వారితో జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కే.ఎస్‌ దివాకర్‌, కార్పొరేటర్‌ కే.ఎస్‌ అశోక్‌, మాజీ మేయర్‌ వెంకటరమణ పాల్గొన్నారు.

సంస్కృతి, వారసత్వాల రక్షణ అందరి కర్తవ్యం1
1/2

సంస్కృతి, వారసత్వాల రక్షణ అందరి కర్తవ్యం

సంస్కృతి, వారసత్వాల రక్షణ అందరి కర్తవ్యం2
2/2

సంస్కృతి, వారసత్వాల రక్షణ అందరి కర్తవ్యం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement