భక్తుల ఇలవేల్పు అమరేశ్వరుడు
రాయచూరు రూరల్: రాయచూరు జిల్లా లింగసూగురు తాలుకా గురుగుంట అమరేశ్వర స్వామి జాతరకు సర్వం సిద్ధమైంది. భక్తుల ఇలవేల్పుగా పేరుగాంచిన గురుగుంట అమరేశ్వరుడి దర్శనానికి భారీగా భక్తులు తరలివస్తారు. జాతరలో భాగంగా ఈనెల 3వ తేదీన ప్రత్యేక పూజలు, రథోత్సవం జరుగుతాయి. జాతరలో భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ఇప్పటికే ఆలయ నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. వివిధ ప్రాంతాల నుంచే వచ్చే వారి సౌకర్యార్థం మూడు రోజుల పాటు ప్రత్యేక బస్సులు నడుపుతామని ఆర్‌టీసీ డీసీ చంద్రశేఖర్ తెలిపారు. కాగా.. అమరేశ్వరలో ఉన్న అమరలింగం క్షేత్రయుగం నాటిది. లంక అధిపతి అయిన రావణాసురుడు ఈ శివలింగాన్ని ఏర్పాటు చేయించినట్లు భక్తుల విశ్వాసం. రావణుడి తల్లి కై కసి రోజూ కేదారకు వెళ్లి పూజలు చేసేది. పాల నైవేద్యాన్ని కుమారుడికి తాపించేది. వయస్సు పెరిగే కొద్ది కైకసికి కొండ ఎక్కడం ఇబ్బందిగా మారడంతో మెట్లు ఎక్కలేక అక్కడే ఉండిపోయింది. ఆకలితో అలమటించే రావణాసురుడు తల్లి రాలేదన్న వార్తను మేనమామకు చేరవేశాడు. మేనమామ అడవిలో చేసిన తపస్సుకు శివుడు ప్రత్యక్షమయ్యాడు. అమర లింగాన్ని పూజించేలా వరం పొందాడు. ఈ లింగాన్ని నేలపై పెట్టకుండా తీసుకెళ్లాలని ఆదేశించాడు. చెల్లెలు కోసం లింగాన్ని తీసుకుని కృష్ణానది దాటుతుండగా రాత్రి కావడంతో అమరేశ్వరలో బస చేశాడు. మామ మహి రావణుడు చేతిలో ఉన్న లింగం భూమి మీదకి పడడంతో భూమిలో నుంచి నీరు బయటకు రావడం కనిపించింది. ఆ లింగం అమరం కావడంతో అమరేశ్వరగా నామాంతరమైంది. తాలుకాలోని యరడోని గ్రామంలో శివభక్త కుటుంబంలో జన్మించిన ఆదయ్య, మాలగుండమ్మ అన్న దాసోహం నిర్వహించే వారు. వీరికి సంతానం కలగక పోవడంతో గురుగుంట అమరేశ్వరుడి కటాక్షంతో బాలుడు జన్మించాడు. గురుగుంట అమరేశ్వర స్వామి తన మహత్యాన్ని ప్రదర్శించిన సందర్భాలు చాలా ఉన్నాయని స్థానికులు చెబుతున్నారు.
ఈనెల 3న రథోత్సవం
ఏర్పాట్లు పూర్తి చేసిన ఆలయ కమిటీ
భక్తుల సౌకర్యార్థం మూడు రోజుల పాటు
బస్సులు నడపనున్న ఆర్టీసీ
భక్తుల ఇలవేల్పు అమరేశ్వరుడు


