ధార్మిక కార్యక్రమాలతో మానసిక శాంతి
మాలూరు: భక్తుల సహకారంతో నిర్మించిన దేవాలయాలకు వెళ్లి పూజలు నిర్వహించడం ద్వారా మానసిక శాంతి, నెమ్మది లభిస్తుందని ఎంపీ మల్లేష్ బాబు తెలిపారు. ఆదివారం చిక్కతిరుపతి గ్రామ పంచాయతీ వ్యాప్తిలోని రాజకృష్ణాపుర గ్రామంలో భక్తుల సహకారంతో నూతనంగా నిర్మించిన కాశీ విశ్వనాథ శివలింగ ప్రతిష్టాపన, కుంభాభిషేక మహోత్సవ విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. దేవాలయాన్ని నిర్మించడం మాత్రమే కాకుండా నిత్యం పూజా కార్యక్రమాలు చేపట్టాలన్నారు. సముదాయ ప్రజలు ప్రభుత్వం అందిస్తున్న వివిధ సౌలభ్యాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో తాపం మాజీ సభ్యుడు ఎస్.వి.లోకేష్, తాలూకా జేడీఎస్ అద్యక్షుడు నారాయణ స్వామి, గ్రామ పంచాయతీ మాజీ సభ్యుడు వెంకటప్ప, దొడ్డి రాజణ్ణ పాల్గొన్నారు.


