కడప వైఎస్‌ఆర్: కడప చైతన్య స్కూల్ హాస్టల్‌లో ఒక విద్యార్థిని సోమవారం ఉదయం ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. 9వ తరగతి చదువుతున్న జశ్వంతి ఆత్మహత్యపై మృతురాలి తల్లిదండ్రులకు సరైన సమాచారం ఇవ్వకుండా రిమ్స్ ఆస్పత్రికి స్కూల్ యాజమాన్యం తరలించడంపై బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు.
తమ కుమార్తె పరిస్థితిపై ముందుగా సమాచారం ఇవ్వకుండా ఆస్పత్రికి ఎలా తరలించారని వారు ఆవేదన వ్యక్తం చేశారు . బంధువులు మృతదేహాన్ని తీసుకుని స్కూల్ వద్దకు వెళ్లి ఆందోళనకు దిగారు. సమాచారం అందుకున్న వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి ఆ బాలిక ఆత్మహత్యకు దారి తీసిన కారణాలపై దర్యాప్తు చేపట్టారు.


